FlipkartSearch

Monday 30 January 2017

పిల్లల కంటిపాపల్ని కాపాడుకుందాం

*👁కంటిపాపల్ని కాపాడుకుందాం!👁*
Photo credit: mbi via Visualhunt / CC BY-SA

*దూరంగా ఉన్న చందమామను చూపించి పిల్లలకు గోరుముద్దలు తినిపించడం ఒకప్పటి మాట. ‘ఆఁ... చేతిలో స్మార్ట్‌ఫోన్‌ని ఉంచితే పిల్లలు ఏం పెట్టినా తినేస్తారనేది’ నేటి తల్లులకు తెలిసిన చిట్కా! కానీ ఆ అలవాటు పిల్లల్లో కంటి సమస్యలు తెచ్చిపెడుతుంది. అంతేకాదు భవిష్యత్తులో ఎటువంటి కంటి సమస్యలూ రాకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా జాగ్రత్తపడాలని చెబుతున్నారు కంటివైద్య నిపుణులు..*


Photo credit: donnierayjones via Visualhunt.com / CC BY
*పుట్టక ముందు*
కంటిచూపులో పుట్టుకతోనే ఉండే జన్యుపరమైన లోపాల గురించి తెలుసుకుందాం. అసలు కళ్లు లేకుండా పుట్టడం, కళ్లు మూసుకుని పుట్టడం, లెన్స్‌ పక్కకు జరిగి ఉండటం, క్యాటరాక్ట్‌ వంటివి కొన్ని కంటి సమస్యలు.  ఇది కాకుండా తల్లికి ఉన్న ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా బిడ్డకు చూపు రాదు. తల్లిలో రుబెల్లా, హెర్పిస్‌ వంటి ఇన్‌ఫెక్షన్లు ఉంటే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నే టార్చ్‌ సిండ్రోమ్‌ అంటారు. ఇది కాకుండా తల్లి గర్భిణిగా ఉన్న సమయంలో  పోషకాహారలేమి వల్ల కూడా ఇలా జరుగుతుంది. తల్లిలో ఉండే దుర్వ్యసనాలు అంటే మత్తుపదార్థాలు తీసుకోవడం కూడా ఈ సమస్యకు దారితీస్తుంది. మధుమేహం ఉన్నప్పుడూ అది బిడ్డ చూపుపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి తల్లి ఏదైనా నరాల సమస్యలకు శక్తిమంతమైన మందులు తీసుకున్నప్పుడూ... అదే సమయంలో గర్భవతి అయినప్పుడూ బిడ్డ చూపు తగ్గుతుంది.
Photo credit: quinn.anya via Visualhunt.com / CC BY-SA
*పుట్టిన తర్వాత*
31 వారాలు నిండకుండా బిడ్డపుడితే అలాంటి పిల్లల్లో రెటినోపతి ఆఫ్‌ ప్రిమెచ్యూరిటీ అనే పరిస్థితి తలెత్తుతుంది. అంటే ఈ నెలలు నిండని పిల్లల్లో కంటిలోని రెటీనాకు వెళ్లాల్సిన రక్తనాళాలు సరిగా వృద్ధి చెందకపోయే ప్రమాదం ఉంది. 1.25 కేజీల కంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లోనూ ఇలానే జరుగుతుంది. ఇలా నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో కంటి సమస్యల్ని గుర్తించి వైద్యులు లేజర్‌ చికిత్సల ద్వారా చూపు సరిచేస్తారు. తక్కువ బరువుతో పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులే చొరవచూపించి పుట్టిన రెండు నుంచి నాలుగు వారాల్లోపు కంటి పరీక్ష చేయించాల్సి ఉంటుంది. తర్వాత వారం విడిచి పరీక్ష చేయించాలి. దాని తర్వాత ఆరువారాలకోసారి చేయాలి. వైద్యుల సూచన మేరకు బడిలో చేర్చేముందు చూపించాలి.

Photo credit: {Charlotte.Morrall} via Visualhunt.com / CC BY
*అది అదృష్టం కాదు...*

గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్లో వచ్చే మెల్లకన్నుని కంటి సమస్యగా గుర్తించరు. పైగా అది అదృష్టం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మెల్లకన్నుని వైద్యపరిభాషలో స్క్వింట్‌ అంటారు. మెల్లకన్నుని చిన్నవయసులో సరిచేయించుకోవడం చాలా అవసరం. అద్దాలూ లేదా శస్త్రచికిత్సతో దీనిని సరిచేయొచ్చు. లేకపోతే చూపు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. కంటి నుంచి నీరు కారుతున్నా, కంట్లో లైట్‌ వేసినప్పుడు చూడలేకపోయినా, కళ్లు ­రికే మూసుకుని ఉన్నా, నల్లగుడ్డు పెద్దగా ఉన్నా, నల్లగుడ్డులో తెల్లతెల్లగా కనిపిస్తున్నా అది గ్లకోమా లక్షణంగా గుర్తించాలి.

*ఫోన్‌ని అదేపనిగా చూస్తుంటే...*
Photo credit: 18mm & Other Stuff via VisualHunt.com / CC BY

ఈ మధ్యకాలంలో పిల్లల్లో కంప్యూటర్‌, స్మార్ట్‌ ఫోన్‌ చూసే అలవాటు బాగా పెరిగిపోయింది. ఇలాంటి పిల్లల్లో కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ రావడానికి ఆస్కారం ఉంది. స్మార్ట్‌ఫోన్ల నుంచి వెలువడే నీలిరంగు కాంతిని హైఎనర్జీ విజిబుల్‌ లైట్‌ అంటారు. ఈ కాంతిలో ఎక్కువసేపు గడిపే పిల్లల్లో కచ్చితంగా కంటి సమస్యలు వస్తాయి. కొన్ని రోజులకే కళ్లు పొడిబారిపోతాయి. అదేపనిగా ఫోన్‌ని కనురెప్పలు ఆర్పకుండా చూడటం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీనికి పిల్లలని కంప్యూటర్‌ ముందు సరైన ఎత్తులో, దూరంలో కూర్చోపెట్టడం చాలా అవసరం.

*సమస్యని గుర్తించడం ఎలా...*

మా పిల్లాడు టీవీకి అతుక్కుపోయి చూస్తాడండి... అందుకే వీడికి తలనొప్పి వస్తోంది, అక్షరాలు కనిపించడం లేదు అంటారు. కానీ ఇది నిజం కాదు. వాడికి చూపులో లోపం ఉండబట్టే అలా టీవీని డగ్గరగా చూస్తున్నాడని తల్లిదండ్రులు గుర్తించాలి. చిన్నపిల్లలు టీవీని మరీ దగ్గరగా కూర్చుని చూస్తున్నప్పుడూ, తలని ఓ పక్కకు వాల్చేస్తున్నప్పుడూ, కంటిని పదేపదే ఆర్పుతున్నప్పుడూ, కళ్ల నుంచి అదేపనిగా నీరు కారుతున్నప్పుడూ, చదువుపై శ్రద్ద చూపించకపోయినప్పుడూ, తరచూ తలనొప్పితో బాధపడుతున్నప్పుడూ, పిల్లలకు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించాలి. ఐదారేళ్ల పిల్లలు చదువులో శ్రద్ధ చూపించలేకపోతే వారిలో మయోపియా, హైపర్‌ మయోపియా, ఆస్టిగ్‌మాటిజం వంటి సమస్యలు కారణం కావొచ్చు. చాలాసార్లు పిల్లల కళ్లు ఎర్రగా మారి వాచిపోతూ ఉంటాయి. వైరస్‌ దీనికి కారణం కావొచ్చు. దీనికి సొంత వైద్యం వద్దు. వైద్యుల్ని అడిగితే మందులు సూచిస్తారు. వ్యాధినిరోధక శక్తి తగ్గినా ఇలా అవుతుంది. కండ్ల కలకలు వంటివి ఉంటే ఇతర పిల్లలకు వ్యాపించే ప్రమాదం ఉంది కాబట్టి విశ్రాంతి ఇవ్వాలి.
Photo credit: Amanda M Hatfield via Visualhunt / CC BY
*ఆహారంలో ఈ మార్పులు చేసుకోవాలి..*

ఆహారంలో నారింజా, ఎరుపు రంగులో ఉండే కాయగూరల్నీ, పండ్లనీ చేర్చుకోవడం మంచిది. పాలు తాగించాలి. అలాగే ఆకుకూరలూ, సముద్ర ఆహారం మేలు చేస్తాయి. వీటిల్లో బీటాకెరటిన్‌ సమృద్ధిగా ఉండటమే కారణం. పిల్లల్లో కంటి సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా పది సంవత్సరాల లోపే సరిచేయించుకోవడం వల్ల భవిష్యత్తులో కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చిన్నతనంలో వదిలేసి తర్వాత వైద్యం చేయించుకుందామని అనుకున్నా అది ఫలించదు. అలాగే పిల్లల చేతికి గంటలుగంటలు ఎలక్ట్రానిక్‌ పరికరాలని ఇవ్వకూడదు. అలాగే కంట్లో ఏదైనా పడినా శుభ్రమైన నీటితో ఎంత నీటితో ఎంత కడిగితే అంత మంచిది. ఆ వెంటనే డాక్టర్‌ చూపించాలి. రోజులో గంటకు మించి ఎలక్ట్రానిక్‌ పరికరాలను చేతికి ఇవ్వకూడదు.

No comments:

Post a Comment