FlipkartSearch

Sunday, 5 February 2017

గాడిదకొడకా

ఒక మంత్రిగారి సుపుత్రుడు కళాశాలలో బాగా అల్లరి చేసేవాడు. ఉపాధ్యాయులను ఏడిపించేవాడు. వాణ్ని ఏమీ చెయ్యలేక ఒక తెలుగు మాస్టారు 'ఓరి ఇరవై అయిదూ, ఇరవై ఆరూ! నోర్మూసుకు కూర్చో' అనేవారు. అది తిట్టో ఏమిటో అర్థమయ్యేదికాదు. చివరికి కళాశాల నిమంత్రణ ఉత్సవం(ఫేర్‌వెల్‌)లో కొందరు విద్యార్థులు 'గురువుగారూ చివరిరోజు కదా, ఇవాళైనా ఆ ప్రహేళిక విప్పండి' అని అడిగారు. దానికి ఆయన 'తెలుగు సంవత్సరాల పేర్లు వెతుక్కోండి' అన్నారు. తీరాచూస్తే ఇరవై అయిదు- ఖర, ఇరవై ఆరు నందన! అంటే, రోజూ వాణ్ని 'గాడిదకొడకా' అని ఆయన కసితీరా తిట్టేవారన్నమాట.(అందుకే తెలుగు నేర్చుకొండని మొత్తుకొనేది) ******వాట్సప్ షేర్******

No comments:

Post a Comment