FlipkartSearch

Showing posts with label Whatsapp Inspirational stories. Show all posts
Showing posts with label Whatsapp Inspirational stories. Show all posts

Sunday, 17 December 2017

భారత్ ఓ ప్రాచీన దేశం. అది ఎంత? భారత దేశం వయసు ఎంత?

మీరు గమనిస్తే భారత్ ఓ ప్రాచీన దేశం. అది ఎంత?
900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి
మరీ భారత దేశం వయసు ఎంత?
ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం
ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం " పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు
ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
"నా దేశం-భారత దేశం"
ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
"శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది
మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు
ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
"హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం
మరీ దేశభక్తుల విషయం...
1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.
జై భారత్ మాత
Unknown Source

Wednesday, 21 June 2017

ఏది జరిగినా నా మంచికే

Photo credit: R E B E L ™® via Visualhunt / CC BY-NC-ND
Photo credit: lensnmatter via Visualhunt.com / CC BY-NC
Photo credit: carbajo.sergio via VisualHunt / CC BY-NC-ND
కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు. ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది. పూజారి బయటకు వచ్చి చూడగా.. పెద్ద బంగారు పళ్లెం ఒకటి కనిపించింది. వెళ్లి చూడగా.. దానిపై ‘నా భక్తుని కొరకు’ అని రాసి ఉంది. ఈ బంగారు పళ్లాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు. పళ్లాన్ని తీసుకుందామని ముట్టుకోగానే.. అది మట్టిపాత్రగా మారిపోయింది. విడిచి పెట్టగానే మళ్లీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది. ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది. ఆలయం కిక్కిరిసిపోయింది. ఒక్కో భక్తుడు రావడం.. పళ్లాన్ని ముట్టుకోవడం.. అది మట్టిపాత్రలా మారిపోవడం.. ఇదే తంతు! విషయం కాశీ రాజుకు తెలిసింది. రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్లాడు. జనులందరూ చూస్తుండగా బంగారు పళ్లాన్ని పట్టుకున్నాడు. అది మట్టిపాత్రగా మారిపోవడమే కాదు.. నలుపు రంగులో కనిపించింది. తానెంత అధముడనో రాజుకు అర్థమైంది. అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇంతలో ఓ పెద్దాయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు. మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చలించిపోయాడు. కళ్లు లేని వాళ్లను చూసి కంటతడి పెట్టుకున్నాడు. ‘విశ్వనాథా! ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు తండ్రి’ అని మొరపెట్టుకున్నాడు. మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సాయం చేశాడు. ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన రెండు ఫలాలనూ ఇచ్చేశాడు. చివరగా ఆలయంలోకి వచ్చాడు. స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలో పళ్లెం సంగతి తెలిసింది. ఈ వింతేమిటో తెలుసుకుందామని అటువైపు వెళ్లాడు. దూరంగా నిల్చుని చూస్తున్నాడు. తిరిగి వెళ్లిపోబోతోంటే.. ఆలయ పూజారి.. ‘ఓ పెద్దాయన.. నువ్వూ వచ్చి ముట్టుకో.. రోజూ గుడికొస్తావ్‌గా, నీ భక్తి ఏ పాటిదో తెలిసిపోతుంది’ అని హేళనగా అన్నాడు. పెద్దాయన వెళ్లి పళ్లెం పట్టుకున్నాడు. అది మరింత బంగారు వన్నెల్లో మెరిసిపోతూ కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అర్చనలు, అభిషేకాల భక్తికి నిదర్శనాలు కాదు. ఆపన్నులను ఆదుకునే తత్త్వం ఉండటమే నిజమైన భక్తి. అలాంటివారే నిజమైన ఆధ్యాత్మికవాదులు.
నా జీవితం లోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు!
నేను శక్తిని అడిగాను - భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.
నేను సంపదను అడిగాను - భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.
నేను ధైర్యాన్ని అడిగాను - భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.
నేను వరాలు అడిగాను - భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.
నేను ఆయన ప్రేమను అడిగాను- భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు.
నేను జ్ఞానాన్ని అడిగాను - భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.
నేను పురోగతి అడిగాను - భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.
నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను - భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు.
నేను ఆయన్ను మరువకూడదు అని అడిగాను - భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు.
నేను పాపాలు క్షమించమని అడిగాను - భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.
అలా జీవితం లో నేను కోరుకున్నదేదీ పొందలేదు - నాకు కావలసిందే నేను పొందాను.
ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటననుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను.
చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్ధం చేసుకున్నాను. మీరు కూడాఅర్ధం చేసుకోండి. జరిగేది అంతా మన మంచికే...లోకా సమస్తా సుఖినోభవ౦తు....🙏🏼🙏🏼🙏🏼⛳

Share it to all your lovely friends & family members ....

Think positive.....Be happy...Stay Blessed.

You may like other blogs:

Convert HD TV to SMART TV


Do eggs really make us fat?

Thursday, 8 June 2017

ఎవరు పేదవారు?

Nice article
ఎవరు పేదవారు???

              ⭐ ⭐ ⭐

ఒక  చాలా సంపన్న మహిళ చీరల షాప్ కి వెళ్లి , "బాబూ! కొన్ని చౌకగా చీరలు చూపించండీ!  నా కుమారుడి వివాహం.  కట్నంగా మా ఇంట్లో పని మనిషికి ఇవ్వాల్సి ఉంది."

అలాగే అని చౌక చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి .
అందులోంచి ఒక చౌక చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ సంపన్న మహిళ.

కొంత సమయం తర్వాత ఆ చీరల షాప్ కి మరొక మహిళ వచ్చి, "అన్నా! కొన్ని ఖరీదైన చీరలు చూపించు! మా యజమానురాలి కొడుకు వివాహం. ఈ సందర్భంగా మా యజమానురాలుకు కట్నం పెట్టడం కోసం నెలనెల డబ్బులు కూడబెట్టాను. ఆమెకు ఒక మంచి చీరను కట్నంగా ఇవ్వాలి.

అలాగే అని ఖరీదైన చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి .
అందులోంచి ఒక ఖరీదైన చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ పేద మహిళ.

ఈ ఇద్దరు స్త్రీలలో ఎవరు పేదవారు?
పేదరికం ఎక్కడ ఉంది ?
మనస్సులోనా?
గుణం లోనా?

సంపన్న మహిళకు ఇంట్లో పేదరికం లేకపోవచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం ఉంది.

ఆ పేద మహిళకు ఇంట్లో పేదరికం ఉండోచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం లేదు.

ఆ ఇద్దరు స్త్రీలను ఇల్లుతోనూ - దేనితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా నిల్చోబెడితే ఎవరు పేదవారు ???

             ⭐ ⭐ ⭐

ఎవరు ధనవంతులు ???

               🔯 🔯 🔯

ఒకసారి, తన కుటుంబం తో ఒక మహిళ టూర్ కు వెళ్లి అక్కడ ఒక త్రీస్టార్ హోటల్ లో బస చేసింది.. ఆ మహిళ ఒక ఆరు నెలల పాపకు తల్లి.

పాప పాల కోసం ఏడుస్తుంటే ఆ మహిళ త్రీస్టార్ హోటల్ మేనేజర్ వద్దకు వెళ్లి " దయచేసి ఒక కప్పు పాలు ఇవ్వగలరా? " అని అడిగింది.

"తప్పకుండా మేడమ్" అని ఆయన బదులిచ్చారు.

" కానీ మేడమ్ మా హోటల్లో ఒక కప్పు పాలు 100 రూ॥ మేడమ్!"

"పర్వాలేదు ఇవ్వండి!" అని ఆ మహిళ పాలు తీసుకుని పాపకు త్రాగించింది.

కొంత సమయం తర్వాత వారందరు అక్కడి ప్రదేశాలను చూడడానికి కారులో బయలుదేరారు.

మధ్యలో పాప ఆకలితో పాల కోసం ఏడుస్తుంటే...

వారు ఒక రహదారి ప్రక్కన ఉన్న టీ స్టాల్ వద్ద కారును ఆపుకున్నారు. ఆ టీ విక్రేత వద్ద ఒక కప్పు పాలు తీసుకుని పాపకు పట్టింది.
తరువాత "ఎంత?"  అని ఆమె టీ స్టాల్ వ్యక్తిని అడిగింది.

"మేడమ్! మేము చిన్న పిల్లల పాలకు డబ్బు వసూలు చేయం" అన్నాడు టీ స్టాల్ వ్యక్తి నవ్వుతూ

ఎంత బలవంతపెట్టినా డబ్బులు తీసుకోలేదతను. అంతే కాదు ప్రయాణంలో పాపకు అవసరమౌతాయని మరో కప్పు పాలు పోసి ఇచ్చాడు.

ఆ మహిళ కారులో కుర్చున్న తరువాత ఆలోచించసాగింది.

నిజంగా ఎవరు ధనవంతులు ? త్రీస్టార్ హోటల్ నిర్వాహకుడా? లేక టీ స్టాల్ విక్రేత నా?

ధనవంతత్వం ఎక్కడ ఉంది?
మనస్సులోనా?
గుణం లోనా??
లేక దాచుకున్న డబ్బుకట్టలు - సంపదలలోనా???

చాలా సార్లు మనమందరం డబ్బు సంపాదన యావ లో పడి మనుషుల మన్న సంగతి మర్చిపోతుంటాము.

కాని ఇలాంటి అనేక సందర్భాలలో " తిరిగి ఏదో ఆశించకుండా చేసే చిన్న చిన్న సహాయాలు " డబ్బు ఇచ్చే కిక్ కన్న ఎన్నో రెట్లు అధికంగా మంచి అనుభూతిని ప్రసాదిస్తాయి.

               🔯 🔯 🔯
           
                   స్వస్తి
       (ఓపికగా చదివిన వారికి )
              ధన్యవాదములు

Thursday, 1 June 2017

అద్రుష్టం ఓడినచోట ఆత్మ విశ్వాసం గెలిపిస్తుంది

ఒక చోట అంతర్జాతీయ రన్నిం గ్ కాంపిటీషన్ జరుగు తున్నది*

*రన్నర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు*

*గన్ పేల్చారు.*

*పరుగు మొదలైంది.*

*ఎలాగైనా గెలవాలి అని అంద రు పరిగెడు తుంటే ఒకడు మాత్రం ప్రాణం పోయినా ఫరవా లేదు అని పరిగెడు తున్నాడు*
*( కారణం ఇది వాడికి చివరి అవకాశం )*

*గమ్యం చేరువలో ఉంది*

*ఊపిరిని బిగబట్టి మరీ అతడు అందరి కన్నా వేగంగా పరిగెడు తున్నాడు..*

*అందరి కళ్ళు అతడి గెలుపు కోసమే చూస్తున్నాయి..*

*జనాలలో ఒకటే ఉత్కంఠత ఇంకో పది మీటర్లు దాటితే అతనే విజేత...*

*అంతే..*

*కాలు స్లిపై అతడు కింద పడి పోయాడు*
*(కింద షూ సోల్ తెగిపోయింది) ఓడిపోయాడు..*

*(ఒక క్షణం ఆగండి.. ఆ తరు వాత అతడు ఏం చేసుం టాడో ఊహించుకొండి..)*

*ఇప్పుడు మీరు ఊహించు కున్న దంతా తప్పు..*

*తను ఓడిపోడానికి నాణ్యత లేని 'షూ'నే కారణం అని తెలుసు కొని తనకు ఎదురైన పరిస్థితి ఇంకెవరికి జరక్కుండా ఉండాలని అతనే ఒక 'షూ' కంపెనీ స్దాపించాడు..••*

*ఇప్పుడు ఆ కంపెని ప్రపంచంలో గొప్ప 'షూ' కంపెనీల జాబితాలో చేరిపోయింది...*
*('షూ' కంపెనీ Nike)*

*ఓడిపోయిన ప్రతిసారి మనం గుర్తు పెట్టుకోవలసిన మాటలు..*

*'ఓటమి ఎప్పుడు ఒంటరిగా రాదు...*

*అద్భుతమైన అవకాశాలను వెంటపెట్టుకుని మరీ వస్తుంది'...*

*నిరాశ, నిస్పృహలతో ఉన్న మనం వాటిని గుర్తించలేక పోతున్నాం...*

*అలాంటి సమయంలోనే మనం ఓడిపోతామనే భయాన్నీ ఉరి తీయాలి,*

*కొల్పోయమనే దుఃఖాన్ని కాల్చి పారేయాలి,*

*కుంగిపోకుండా నిరాశకు తల కొరివి పెట్టాలి...*

*ఏదైనా మొదలు పెట్టేటప్పుడు చివరి మెట్టు చూస్తే భయమే కలుగు తుంది.*

*నీ ముందు మెట్టు మాత్రమే చూస్కుంటూ ఎక్కు ఏదో రోజు వెనక్కి తిరిగి చూస్తే ప్రతీ మెట్టు మీద రక్తపు మరకలు కనపడ తాయి...*

*ఆ రక్తం నీది కాదు, నీ కాళ్ళ కింద నలిగిపోయిన కష్టాలవి...!!*
*మనోహరా*
*********************

Wednesday, 10 May 2017

నిజంగా జరిగిన కథ

నిజంగా జరిగిన కథ!!
Bore అనిపించినా, దయచేసి పూర్తిగా చదవండి!
పని ముగించుకుని, ఇంటికి బయలుదేరుతున్న అతన్ని
బస్సు గుద్దేసింది,,హాస్పిటల్ లో, ఆక్సిడెంట్ కి గురయిన తన తండ్రికి అర్జెంటు గా 4 యూనిట్ల రక్తం అవసరం అయింది,
వెంటనే తన మొబైల్ డేటా ఆన్ చేసి,
ఫేస్బుక్ లో వాట్సాప్ లో కావాలసిన రక్తం గ్రూప్ వివరాలను టైపు చేసి తన కాంటాక్ట్స్ అందరితో
పంచుకున్నాడు, కానీ... అతను ఊహించినంత స్పందన రాలేదు, కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్న తన తండ్రిని కాపాడుకోవాలని విలవిల లాడిపోయాడు, కానీ ఏం లాభం,
అవసరానికి రక్తం అంధక, ఆపరేషన్ ఆగిపోయింది,
ఆ తండ్రి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి,
అయితే, నా తండ్రిని నేనే చంపుకున్నాను,
నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు,
నేను ఎంత నీచుడిని అని వెక్కి వెక్కి ఏడ్చాడు..
కారణం??
ఈ సంఘటనకు మునుపు, ఎన్నో అబద్దపు సందేశాలను తానే సృష్టించి తన కాంటాక్ట్స్ లోని వారందరికీ పంపించేవాడు,
అవి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంటే, తెగ సంబరపడిపోయేవాడు, అలాంటి పసలేని సందేశాలను పంపిస్తున్న అతని సందేశాలను, స్పందించే వారు తగ్గిపోయారు,
అతడినుండి వచ్చిన తన తండ్రికి అవసరమయిన రక్తానికి సంబంధించిన సందేశాన్ని కూడా, నిజంగా సహాయపడగలిగే పరిస్థితిలో ఉన్న వారు చూసి కూడా,
హా ఇది Fake మెసేజ్ అయుంటుంది లే, అని లైట్ తీసుకున్నారు,తాము తవ్వుకున్న గోతిలో తామే ఏదో ఒకరోజు పడతారు అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ.
సాయిబాబా పుట్టినరోజు అని, వినాయకుడి తల నరికిన రోజు,
అమ్మ కోసం అని, AIDS ఇంజక్షన్ వేస్తారని,
ఈ ఆడియో, ఫోటో షేర్ చేస్తే, వాట్సాప్ చిల్లర పైసలు ఇస్తుందంటూ  ఆడియో లు
ఇలాంటి సందేశాలను సృష్టించి సరదా పడుతున్న వారు,
ఏదో ఒకరోజు తీవ్రమయిన నష్టాన్ని చవిచూస్తారు,
వారు సృష్టించే అబద్ధపు సందేశాలు ఉరిగా మారి తమని తమవారిని కబళించే ప్రమాదం వుంది,
ఎవరికయినా మనం సందేశం పంపుతున్నాము అంటే దానికి అవతలి వారు విలువ ఇచ్చేలా ఉండాలి గానీ, చెత్తను వూడ్చినట్టు డిలీట్ చేసి పడేసేలా వుండకూడదు,
అలాంటి పనికిమాలిన సందేశాను సృష్టించే వారు, ఫార్వర్డ్ చేసే వారు, ఆత్మ పరిశీలనా చేసుకోవాలి
అలాంటి సందేశాలను సృష్టించే వారికి ఈ సందేశాన్ని అంకితం చేస్తూ..
ఈ నిజాన్ని పదుగురితో పంచుకోండి.. !!

Don't die by laugh.....

When I ask my friend who is having a Rs 60000/- bike, which fuel he is using. 
He replied, it's Petrol. 
When I asked why don't he try Kerosene?  His reply was, the engine will be spoiled. 
I again asked him, will you drink?? 
He quietly said 'yes'.
When I questioned, won't it spoil your engine??? 
He humbly replied, it's only occasionally... 

My question is, can we pour kerosene occasionally in our bike??? For a change??? 

We give more value to our 60000 bike but not for our life. 

Our life is more valuable and more Important.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
So never change a brand.  If it's Whisky, let it be Whisky. 
If it's Rum let it be Rum. 😳


__________________________________________

Don't die by laugh.....
✂✂✂✂✂✂✂✂
Killer joke:

The Students of MBBS were attending their 1st Biochemistry Class. 
They all gathered around the Lab table with a Urine sample. 
The Professor dip His Finger in urine & tasted it in his own mouth. 
Then he asked the Students to do the same. The students hesitated for several minutes, 
but at last every one dipped their finger in urine sample & tasted it....
When everyone finished, the Professor looked at them & said: 

The most important Quality is 'Observation'.  I dipped my MIDDLE Finger but tasted the INDEX Finger. Today you just Learnt, "How to Pay Attention".  All Students shouted...
saala kuttta!!!



😜BOSS in office : Okay guys, today we are going to play a game.....

When I say a name of the fruit, you run to the right  side of the hall....

And when I say any color, you run to the left side of the hall....

One who runs on wrong side will not get the bonus this diwali...
got it ?

Employees : Yes Boss, Got it.

Boss : Okay...Ready, Set...
.  ... ....
..... "ORANGE" !

Employees : saale sidha bol na bonus nahi dega... 😳😳😰😰😡😡

Lion asked his newly wedded lioness "tumhara shaadi se pehlay koi affair tha?"

Lioness smiles and said: "Aapki Is bat pe ek sher yad aa gaya..."


😳

Tuesday, 9 May 2017

నాడు - నేడు

గతంలో సంసారం చీకట్లో జరిగేది,జీవితాలు వెలుగులో ఉండేవి,
నేడు సంసారం వెలుగులోకి వచ్చింది,
జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి,కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ,
చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు,
నాడు కొందరే మందుకు, విందుకు,అలవాటు పడేవారు,
నేడు కొందరే వీటికి దూరంగా ఉంటున్నారు,
నాడు కష్టమొస్తే, కుటుంబం సభ్యులు ధైర్యం చెప్పేవారు,
నేడు కుటుంబం కుటుంబాలే కష్టాల కడలికి బలియౌతున్నాయి,
నాడు తినడానికి శ్రమించి సంపాదించే వాళ్ళం,
నేడు తిన్నది అరగడానికి తిన్నగా శ్రమిస్తున్నాం,
నాడు జబ్బు చేస్తే శక్తి కోసం పండ్లు, పాలు తాగేవాళ్ళం,
నేడు అదే డబ్బుతో బిళ్ళలు కొని,జబ్బులు కొనితెచ్చుకుంటున్నాం,
గతంలో అందరూ హార్డవేర్ ఇంజనీర్లే!!అయినా మనసు సాప్ట్ గా ఉండేది,
ఇప్పుడు అంతా సాప్ట్ వేర్ ఇంజనీర్లే!
మనసు మాత్రం పెళ్ళాం తో పంచుకోలేనంత హార్ట్ గా మారిపోయింది,
అప్పుడు వైద్యుడు ఇల్లిల్లూ తిరిగి వైద్యం చేసేవాడు, బిల్లు వల్ల జేబుకు చిల్లు పడేదికాదు,
నేడు ఇంటిల్లిపాదీ వైద్యుని ముందు క్యూ కట్టారు,
సంపాదన సగం, వైద్యునికి సమర్పణం,
నాడు సేవచేయటానికి రాజకీయాలు చేస్తే!
నేడు శవ రాజకీయాలు చేసేందుకు రాజకీయాలు చేస్తున్నారు,
నాడు భవతీ బిక్షాందేహీ అంటే, పనికల్పించి అన్నం పెట్టేవారు,
నేడు భిక్షగాడు సైతం మందుతాగి,ఇంటిముందు తూలుతున్నాడు,
నాడు దొంగలు నట్టింట్లోపడి దోచుకెళ్ళేవారు,
నేడు దొంగలు దొరల్లాగా నెట్ ఇంట్లో దోచేస్తున్నారు,
ఒకప్పుడు దొంగల్ని పట్టడానికి  పోలీసులు తిరిగేవారు,
ఇప్పుడు హైటెక్ పోలీసుల చుట్టూ దొంగలే తిరుగుతున్నారు,
పదికిలోమీటర్లు నడిచి,పదిరూపాయలు పెట్టి సినిమా చూసేవాళ్ళం,
ఇప్పుడు ఇంటిముందు సినిమాని వెయ్యి రూపాయలు పెట్టి చూస్తున్నాం,
అప్పుడు అప్పు చేయాలంటే తప్పు చేసినట్లు బాధపడేవాళ్ళం,
ఇప్పుడు తప్పు చేయడానికే అన్నట్లు  అప్పు చేసేస్తున్నాం,
ఒకప్పుడు కప్పు పాలు,పెరుగు అమ్మి,సొమ్ము చేయలేక తాగేవాళ్ళం,
ఇప్పుడు ప్లాస్టిక్  కప్పుల్లో పాలు, పెరుగు తినేస్తున్నాం,
చైనా నుండి పెన్నులు,గన్నులు మాత్రమే  వచ్చేవి,
నేడు చైనా ప్లాస్టిక్ బియ్యం కూడా వస్తున్నాయి...

ఇది మనం సాధించిన పురోగతా.....!
లేక మనకు మనం తెచ్చుకున్న అధోగతా....!
ఆ తదాగతనికే ఎరుక....మనకు మిగిలె ఏరువాక....
.

Saturday, 15 April 2017

మంచి నీళ్ళు ఎప్పుడు , ఎంత , ఎలా , ఏ విధముగా త్రాగాలి ?


అన్ని రోగాలకి చికిత్సకంటే , రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానము అంటారు మహర్షి వాగ్భటాచార్యుడు .

"భోజనాంతే విషం వారీ" , అంటే భోజనం చివర నీరు త్రాగటం "విషం"తో సమానం . మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది . అక్కడ అగ్ని ( జఠరాగ్ని ) ప్రదీప్తమవుతుంది . ఆ అగ్ని తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది . ఇది ప్రధానమైన విషయం . 

భోజనం తిన్న తరువాత నీళ్ళు త్రాగితే జఠరాగ్ని చల్లబడుతుంది . ఇక తిన్న ఆహారము అరగదు . అది కుళ్ళి పోతుంది . కుళ్ళిన ఆహారం నుండి వచ్చిన విషయవాయువులు శరీరమంతటా వ్యాపిస్తాయి . ఆ విషయవాయువుల వలన 103 రోగాలు వస్తాయి . ఆ కుళ్ళిన ఆహారం వల్ల వచ్చేది కొలెస్ట్రాల , ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు. 

నీరు త్రాగే విధానం :-- 
నీటిని గుటక గుటకగా త్రాగాలి . ఒక్కొక్క గుటక నోటిలో నింపుకంటూ చప్పరిస్తూ త్రాగాలి . వేడి వేడి పాలు త్రాగే విధంగా నీటిని త్రాగాలి . నీరు ఎపుడు త్రాగినా ఈ విధంగానే త్రాగాలి . ఇది నీరు త్రాగే సరైన విధానం . గటగటా నీరు త్రాగడం సరైన విధానం కాదు.

ఫలితము :---
నీటిని గుటక గుటక చప్పరిస్తూ త్రాగితే నోటిలోన వున్న లాలాజలంతో నీరు కలిసి పొట్టలోకి చేరుతుంది . పొట్టలో ఆమ్లాలు తయారవుతాయి . లాలాజలం పొట్టలోని ఆమ్లాలతో కలిసి న్యూట్రల్ అవుతుంది . అసలు నోటిలో లాలాజలం తయారయ్యేది పొట్టలోకి వెళ్ళటానికి , లోపలి ఆమ్లాలని శాంతింప చెయ్యటానికి . అపుడు మనం జీవితాంతం ఏ రోగాల బారినపడకుండా ఆరోగ్యంగా జీవించ వచ్చును. 

ఎప్పుడు త్రాగాలి : ---- 
బ్రేక్ ఫాష్ట్ లేక భోజనమునకు గంట ముందు నీళ్ళు త్రాగాలి .
బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం చేసిన గంట న్నర తరువాత త్రాగాలి . (ఆహారం జఠర స్ధానంలో గంటన్నర వరకు అగ్ని ప్రదీప్తమై ఉంటుంది). అపుడు ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది‌ . 

భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్ఛును . భోజనం ముగించాక గొంతు శుద్ధి కోసము , గొంతు సాఫీగా ఉంచటానికి 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చును . 
# ఉదయం బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం తరువాత పండ్లరసాలు త్రాగవచ్ఛును .
# మధ్యాహ్న భోజనం తరువాత మజ్జిగ త్రాగవచ్చును .
# రాత్రి భోజనాంతరము పాలు త్రాగవచ్చు .

ఈ క్రమాన్ని ముందు వెనుకలుగా చెయ్యవద్దు . ఎందుకంటే ఆయారసాలను పచనం చేసే ఎంజైమ్స్ ఆ సమయాల్లో మాత్రమే మన శరీరంలో ఉత్పన్నమవుతాయి . 

నీరు ఎంత త్రాగాలి : --
మీరున్న బరువును 10 తోటి భాగించి 2 ను తీసివేస్తే వచ్చినది మీరు త్రాగవలసిన నీటి శాతం చూసుకొని త్రాగండి . ఉదా: మీరు 60 కిలోల బరువు వుంటే 60 ని 10 చే భాగించితే 6 వస్తుంది . దీనిలో నుండి 2 తీసివేస్తే 4 వస్తుంది.  మీరు 24 గంటల్లో 4 లీటర్ల నీరు త్రాగవలెను . 

ఎలా త్రాగాలి :-- 
# ఎల్లప్పుడూ సుఖాసనంలో కూర్చొని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగాలి .
# నిలబడి నీళ్ళు త్రాగరాదు . 
# చల్లని నీళ్ళు ( Cool Water)  త్రాగరాదు .
# గోరు వెచ్చని నీళ్ళు త్రాగవలెను .
# ఎండాకాలములో ( మార్చి నుండి జూన్) మట్టికుండలోని నీరు త్రాగవలెను .

*మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు.
* మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు .
* స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగరాదు.

మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన మూత్ర సంబంధ  వ్యాధులు వస్తాయి . 
మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన యెడల మలబద్ధకం వస్తుంది . 
స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగిన యెడల చర్మ వ్యాధులు లేక ఉబ్బసం వంటి జబ్బులు వస్తాయి . 
ఎండ నుండి నీడకు వచ్చి వెంటనే నీళ్ళు త్రాగితే సమస్యలు వస్తాయి . 
రిఫ్రిజిరేటర్ నీళ్ళు చాలా హానికరము . 

    మనకు ఆహారము ఎంత ప్రధానమో , తిన్న ఆహారము సక్రమంగా జీర్ణమటం అంతే ప్రధానము .

మనము తిన్న భోజనము జీర్ణము కాని యెడల అది కుళ్ళిపోతుంది . ఆ కుళ్ళిన ఆహారము వలన శరీరంలో విషవాయువులు పుట్టి 103 రోగాలకు కారణం అవుతుంది . మొట్టమొదట గ్యాస్ ట్రబుల్ , గొంతులో మంట , గుండెలో మంట , ఎసిడిటీ , హైపవర్ ఎసిడిటీ , అల్సర్ , పెప్టిక్ అల్సర్ మొదలగునవి వస్తాయి . చివరగా క్యాన్సర్.  

మీరు ఎల్లప్పుడూ నీటిని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగిన యెడల , మీరు జీవితంలో ఏ రోగాల బారిన బడరు . సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుంటారు .

ఈ సృష్టిలో ప్రతి జంతువు నీటిని చప్పరిస్తూ ఒక్కొక్క గుటకగా త్రాగుతుంది.

---శ్రీ రాజీవ్ దీక్షిత్.

Got it as a whatsApp message credit goes to ---శ్రీ రాజీవ్ దీక్షిత్.

ఇది మంచి పోస్ట్!చాలామంది దీనిని ఫార్వర్డ్ చేశారు, చేస్తున్నారు, చేస్తారు కూడా!

Monday, 20 March 2017

Important Websites for Teachers and students

Useful Websites for Teachers and students
Important  Websites for Teachers and students

१)www.gurumitra.in
२)www.navnirmitilearning.org 
३)www.majalgaonbrc.com
४)www.baljagat.com
५)Abhijitghorpade.wordpress.com
६)networkedblogs.com
७)http://www.palakneeti.org/  ( e books )
८)joshworth.com/dev/pixelspace/pixelspacesolarsystem.html
९)http://www.learningwhiledoing.in/
१०)shiksha.Com
११)http://study.taaza.com/
१२)http://www.meracareerguide.com/
१३)inmyschool.in
१४)http://boltipustake.blogspot.in
१५)www.teacherofindia.org
१६)http://www.whereincity.com
१७)www.majalgaonbrc.com
१८)www.avakashvedh.com
१९)www.quest.org.in
२०)http://marathidesha.com
२१)www.zpkolhapur.gov.in
२२)http://www.prajakt-zaware.blogspot.in
२३)http://inmyschool.in
२४)http://www.balbharati.in
२५)www.swselearn.com
२६)http://www.zpschoolmaliwada.com
२७)www.virtualuniversity.com
२८)http://www.mscert.net
२९)www.killedar.org
३०)http://ebooks.netbhet.com
३१)www.swselearn.com
३२)http://www.mscert.net
३३)www.impnewszpgr.hpage.com
३४)www.trgmdm.nic.in
http://mahanews.gov.in
३५)www.ssa.nic.in
३६)http://dgipr.maharashtra.gov.in

Got it as a forwarded message..Please inform and share to all groups, it is really useful information to those who are in Education field.

*.✡✍FUNDAMENTAL RULES🅾*_

🔹F.R. 12(a) : 👉1 శాశ్వత పోస్ట్ లోకి ఇద్దరూ, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఒకే సారి నియమించరాదు.

🔹F. R. 12(బి) : 👉ఒక govt employee ని ఒకే సారి 2 లేక అంతకంటే ఎక్కువ పోస్ట్ లలో నియమించరాదు.

🔹F. R. 12(c) : 👉ఉద్యోగి లీవ్ లో ఉంటే ఆ పోస్ట్ లో మరొకరిని appoint చేయకూడదు.

🔹F. R. 15(b) : 👉ఉద్యోగి 1 డే కూడా మెడికల్ లీవ్ పెట్టుకోవచ్చు.

🔹F. R. 18 : 👉govt appoint చేస్తే తప్ప, ఏ employee కి ఒకే సారి 5y కంటే ఎక్కువ సెలవు మంజూరు చేయకూడదు.

🔹F. R.18(a) : 👉1y కంటే ఎక్కువ కాలం పర్మిషన్ లేని సెలవు లో ఉంటే, అతను రాజీనామా చేసినట్లు లెక్క.

🔹F.R.18(బి) : 👉పర్మిషన్ ఉన్నా /పర్మిషన్ లేకుండా 5y కంటే ఎక్కువ కాలం లీవ్ లో ఉంటే అతను జాబ్ కి రాజీనామా చేసినట్లు లెక్క.

🔹F. R.18(c) : 👉5y కంటే ఎక్కువ కాలం ఫారిన్ సర్వీస్ లో ఉన్నపుడు అతను జాబ్ కి రాజీనామా చేసినట్లు లెక్క.

🔹F. R.22(a) : 👉ప్రస్తుత పోస్ట్ విధుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత విధులు గల పోస్ట్ లోకి నియమించబడినప్పుడు ప్రస్తుత వేతనం కంటే నూతన స్కేలు లో ఫై స్టేజి వద్ద స్థిరీకరి0చబడుతుంది.

🔹F. R.22(a)(iv) : 👉ఒక ఉద్యోగి APPSC ద్వారా మరొక పోస్ట్ కి సెలెక్ట్ అయినపుడు పాత పోస్ట్ లోని వేతనాన్కి తక్కువ కాకుండా కొత్తగా ఎంపిక ఐన పోస్ట్ లో వేతనం స్తిరీకరి0చబడును.కొత్త ఉద్యోగం లో చేరిన తేదీ నుంచి 1y తరువాత మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వబడును.ఇక పాత పోస్ట్ లోని ఇంక్రిమెంట్ డేట్ పోతుంది.

🔹F. R.22(B) : 👉ఒక పోస్ట్ నుండి మరొక పోస్ట్ కి పదోన్నతి పొందినప్పుడు, కింది పోస్ట్ లో పొందుతున్న వేతనానికి ఒక notional increment కలిపి వచ్చిన వేతనాన్ని ప్రమోషన్ పోస్ట్ స్కేల్ లో ఫై స్టేజి వద్ద నిర్ణఇ0చాలి.పదోన్నతి వచ్చిన ఉద్యోగి 2 రకాల వేతన స్తిరీకరణ కై ఆప్షన్ కలిగి ఉంటాడు.అవి (a)పదోన్నతి వచ్చిన తేదీ (b)కింది పోస్ట్ లో ఇంక్రిమెంట్ తేదీ కి ఆప్షన్ ఇచ్చుకోవటం.

🔹F. R.24 : 👉వార్షిక ఇంక్రిమెంట్ యధాలాపంగా వస్తుంది. ఉద్యోగి ప్రవర్తన సంతృప్తి కరంగా లేకపొతే ఆతని ఇంక్రిమెంట్ అపి వేయవచ్చు.ఇలా అపి వేస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పుడు,అలా ఎంతకాలం అపి వేస్తున్నారో అలాగే with cumulative లేదా with out cumulative effect అన్న విషయం ఉత్తర్వుల లో తెలుపవలెను.

Ex : 👉ఒక ఉద్యోగి 1.6.10న ఇంక్రిమెంట్ తీసుకున్న తరువాత పనిష్మెంట్ గా 2 ఇంక్రిమెంట్ లు ఆపారు అనుకుందాం.
(a)with cumulative effect : 👉ఈ విధంగా చేస్తే 1.6.13 నకు ఒకే ఒక ఇంక్రిమెంట్ వస్తుంది.
(b)with out cumulative effect: 👉ఈ విధంగా చేస్తే 1.6.13 నకు 3 వార్షిక increment లు వస్తాయి.అంటే 2 వార్షిక increments arrears కోల్పోయినట్లు.

🔹F. R.26 : 👉 ఇంక్రిమెంట్ కి పరిగణింపబడే సర్వీస్ కి సంబందించిన షరతులు ఉన్నాయి.
👉ఒక టైం స్కేల్ లో పని చేసిన కాలం ఇంక్రిమెంట్ కి  లెక్కించబడుతుంది.
👉ఐతే జీత నష్టపు సెలవు పెట్టి ఉంటే అంతకాలం వార్షిక ఇంక్రిమెంట్ వాయిదా పడుతుంది.
👉180 రోజుల వరకు వైద్య కారణాల తో జీత నష్టపు సెలవు వాడు కొన్నపుడు ఇంక్రిమెంట్ తేదీ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికారము Head of department లకు ఇవ్వబడినది.

🔹F.R.26(a) : 👉ఏదయినా పరీక్ష పాస్ అయిన0దు వల్ల ఉద్యోగికి ఏదయినా హక్కు లేదా మినహాఇ0పు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష మరుసటి తేదీ నుండి మంజూరు అయినట్లు గా భావించాలి.

👉కొత్తగా ఉద్యోగం లో చేరిన లేదా ప్రమోషన్ పోస్ట్ లో చేరిన ఉద్యోగికి ఆతని వార్షిక ఇంక్రిమెంట్ 12 నెలల కాలం పూర్తి కాకుండానే మంజూరు అవుతుంది.
Ex: 19.12.73 నాడు ఉద్యోగం లో చేరిన ఉద్యోగి మొదటి వార్షిక ఇంక్రిమెంట్ 1.12.74 నకే మంజూరు అవుతుంది.
👉ఒక ఉద్యోగి రిటైర్ ఐన తేదీ మరుసటి రోజు వార్షిక ఇంక్రిమెంట్ తేదీ ఉన్నపుడు pentionery benifits కోసం notional మంజూరు అయినట్లు భావించి లెక్కించాలి.
👉ఐతే లీవ్ encashment వంటి వాటికి ఇది వర్తించదు.

🔹F. R.44 :👉 ఉద్యోగి లీవ్ లో ఉన్నపుడు 4 నెలల వరకు HRA పూర్తి గా మంజూరు చేయవచ్చును.అర్ద లేదా పూర్తి వేతన సెలవు మీద వున్న ఉద్యోగి HRA, అతడు సెలవు మీద వెళ్ళేటప్పటి వేతనం మీద లెక్కించబడుతుంది.

🔹F.R.49 :👉 govt ఒక ఉద్యోగి ని temporary గా 2 పోస్ట్ లకి నియమించవచ్చును.

🔹F.R.49(a) : 👉 ఈ విధంగా 2 పోస్టులు చూస్తున్నప్పుడు ఏది ఎక్కువ వేతనం కలిగి ఉంటుందో, ఆ వేతనం మంజూరు చేయవచ్చు.
👉ఉద్యోగిని అదనపు పోస్ట్ ను కూడా నిర్వహించమన్నపుడు మొదటి 3 నెలల వేతనం లో 1/5 భాగం ,next 3 నెలలు 1/10 భాగం అలవెన్సు చెల్లించబడుతుంది.



💠💠 *ప్రత్యేక ఆకస్మిక సెలవుల(Spl.Casual Leave) గురించిన సమాచారం సంబంధిత ఉత్తర్వులతో...* 💠💠

💎 ఫండమెంటల్ రూలు-85 రూలింగ్ 4 లోని అనుబంధం-VII ఐటమ్ 11 లో విశదీకరించారు.

💎 ఉద్యోగి వ్యక్తిగత ప్రయోజనాలతో సంబంధo లేకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేయవచ్చు.

💎 ఈ ప్రత్యేక ఆకస్మిక సెలవు సాధారణ,యాదృచ్చిక సెలవు 15 రోజులకు అదనంగా మంజూరుచేయవచ్చు.

💎 క్యాలెండర్ సం॥లో 7
రోజులకు మించకుండా ప్రత్యేక సాధారణ సెలవు వాడుకోవచ్చు.
*(G.O.Ms.No.47,Fin తేది:19-02-1965)*

💎 సాధారణ సెలవు నిల్వయున్నపటికి Spl.CL వాడుకోవచ్చు.Spl.CL ఇతర సాధారణ సెలవుదినాలతో కలిపి 10 రోజులకు మించకుండా వాడుకోవాలి.

💎 రక్తదానం చేసిన ఉద్యోగికి ఒకరోజు Spl.CL ఇవ్వబడుతుంది.
*(G.O.Ms.No.137 M&H తేది:23-2-1984)*

💎 పురుష ఉద్యోగులు వేసక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి ఆరు రోజులకు (6) మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల ఆరు(6) రోజులు మంజూరుచేయవచ్చు.
*(G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)*
*(G.O.Ms.No.257 F&P తేది:05-01-1981)*

💎 మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి  ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పధ్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరుచేయవచ్చు.
*(G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)*
*(G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)*

💎 కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స భార్య చేయించుకున్నచో ఆమెకు సహాయం చేయుటకు ఉద్యోగి అయిన భర్తకు ఏడు(7) రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.802 M&H తేది:21-04-1972)*

💎 మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.128 F&P తేది:13-04-1982)*

💎 ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)*

💎 మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)*

💎 మహిళా ఉద్యోగులు గర్భవిచ్చితి(Medical Termination of Pragnancy) తర్వాత Salpingectomy(గర్భాశయనాళo తొలగింపు) ఆపరేషన్ చేయించుకున్నచో సందర్భంలో పద్నాలుగు(14) రోజులకు మించకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు పొందవచ్చు.
*(G.O.Ms.No.275 F&P తేది:15-05-1981)*

💎 చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరుచేయబడును.
*(G.O.Ms.No.762 M&H తేది:11-08-1976)*

💎 పురుష ఉద్యోగులకు భార్య ప్రసవించినపుడు 15 రోజుల పితృత్వ సెలవు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.231 తేది:16-09-2005)*

💎 ప్రభుత్వ గుర్తింపు కలిగి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం గల ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలకు చెందిన జిల్లా ప్రధాన బాధ్యులకు సంఘ కార్యకలాపములకు  హాజరగు నిమిత్తం అదనంగా 21 రోజుల స్పెషల్ క్యాజువల్ సెలవు మంజూరు సదుపాయం కలదు.
*(G.O.Ms.No.470 GAD తేది:16-09-1994)*
*(G.O.Ms.No.1036 GAD తేది:29-11-1995)*☸🏀🛑

Tuesday, 31 January 2017

వసంత పంచమి విశిష్టత

All about vasantha panchami in telugu వసంత పంచమి విశిష్టత ఏమిటి?
మాఘ మాసం (జనవరి-ఫిబ్రవరి) శుక్ల పక్షం లో ఐదవరోజును (పంచమి తిథి) వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని జరుపుకుంటారు. ఈ రోజు జ్ఞానానికి, సంగీతానికి, కళలకు దేవత అయిన సరస్వతీ దేవిని పూజిస్తారు. అయితే వీణాధరిని పూజించే మరొక పర్వ దినమైన "సరస్వతీ పూజ" దసరాలలో వస్తుంది. ముఖ్యంగా వసంత పంచమి నాడు ఎక్కువగా పిల్లలకు "అక్షరాభ్యాసం" జరుపుతారు.  హిందూ సంస్కారాలలో అక్షరాభ్యాసం ఒకటి. నామకరణం (బారసాల), అన్నప్రాసన, ముండనం (పుట్టు జుట్టు ఇవ్వడం), అక్షరాభ్యాసం (విద్యారంభం), ఉపనయనం, వివాహం మొదలయినవి అన్నీ సంస్కారాలే.
      అక్షరాభ్యాసం (అక్షర అభ్యాసం) అంటే అక్షరాలను సాధన చేయడం. దీన్ని ఈ దినం తొలిసారిగా దిద్దటం తో ప్రారంభిస్తారు. సాధారణంగా పిల్లలకు అయిదు సంవత్సరాల ప్రాయం లో అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరం అంటే క్షరము లేదా క్షీణత లేనిది లేదా నశింప లేనిది; "అభ్యాసం" అంటే సాధన.  ఇంకో విశేషం ఏమిటంటే "అక్షర" లో "అ" మొదలుకుని "క్ష"-"ఱ" తో ముగిసేవి కనుక "అక్షఱ"ములు అని చెప్పుకోవచ్చును.
      అక్షరాభ్యాసం చేసేటప్పుడు "ఓం నమః శివాయ సిద్ధం నమః" అని ముందుగా ఒక పళ్ళెంలో బియ్యం పోసి వేలితో వ్రాయించి తరువాత కొత్త పలక పై వ్రాయిస్తారు. అయితే పరిణామ క్రమం లో పలక-పుల్ల నుంచి పుస్తకం-పెన్సిల్/పెన్ను తదుపరి కంప్యూటర్ - మౌస్ కు మారాయనుకోండి.
అయితే అక్షరాభ్యాస సమయంలో సరస్వతీ దేవిని ఇలా స్తుతిస్తారు.

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ భవతు మే సదా!

వాగ్దేవి సరస్వతి ని తలచుకొంటే 'బాసర' జ్ఞాన సరస్వతి ఆలయం చెప్పుకోదగినది.  ఈ ఆలయం తెలంగాణా లో నిర్మల్ జిల్లాలో పావన గోదావరీ తీరాన వుంది. కురుక్షేత్ర యుద్దానతరం శాంతి కోసం వేదవ్యాసుడు తన శిష్యులతో తపస్సు చేసుకోవడానికి ఒక ప్రశాంతమైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ, దండకారణ్యం దర్శించి, ఆ స్థలం చాల అనుకూలంగా ఉంటుందని తలచి, సమీపంలోని గోదావరి నదినుండి దోసిళ్ళతో ప్రతి రోజూ ఇసుకను తెచ్చి మూడు రాశులుగా పోయగా అవి పసుపు పూసిన సరస్వతి, లక్ష్మి మరియు కాళీ మూర్తులుగా, ముగ్గురమ్మలు గా మారాయట. ఈ పసుపును(బండారు) కొద్దిగా తింటే విజ్ఞానము, వివేకము పెంపొందుతాయని భక్తుల నమ్మకం.   వ్యాసుని చే సృష్టించ బడిన ఈ ప్రదేశం "వ్యాసపురి,"గా"వాసర" గా, తదుత్తర కాలంలో "బాసర" గా వాసి కెక్కిందని స్థల పురాణం. ఆ విధంగా వసంత పంచమి నాడు ఎక్కడ చూసినా పసుపు రంగు దర్శనమిస్తుంది. అమ్మవారికి పసుపు చీరలు పెడతారు. పసుపు రంగుల మిఠాయిలు నైవేద్యం పెడతారు.  ఎందఱో తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం కోసం బాసరకు వస్తారు.  అంతే కాదు చాల మంది యుక్తవయస్కులు సరియైన ఉపాధి లేక, జీవితంలో స్థిరపడని వారు బాసర క్షేత్రం దర్శించి ఇక్కడి పావన గోదావరిలో మూడు మునకలేసి దీక్షగా భిక్ష చేసిన వారికి అనువైన బ్రతుకుతెరువు లభిస్తుందని పలువురి నమ్మకం. అందుకే భాషను పెంపొందించి, బ్రతుకు బాట చూపి బాసట గా నిలిచేది బాసర.

Sunday, 22 January 2017

Failures of Inspirational Personalities

"I failed in 8th standard"
-Sachin Tendulkar



"I was rejected for the
job in All India Radio
bcoz of my heavy voice"
- Amitabh Bacchan

"I used to work in petrol
Bunks"
- Dhirubhai Ambani

"I was rejected in the
interview of Pilot"
- Abdul Kalam

"I didn't even complete
my university education"
- Bill Gates

"I used to serve tea at
a shop to support my
football training"
- Lionel Messi

"I used to sleep on the
floor in friends rooms,
returning Coke bottles
for food, money, and
getting weekly free
meals at a local temple"
-Steve Jobs

"My teachers used to
call me a failure"
- Tony Blair

"During my secondary
school, I was dropped
from school basketball
team"
-MichelI Jordan


"Friends, there are
many such people who
struggled..

Life is not about what
you couldn't do so far,
it's about what you can
still do.
Wait n dont ever give up..
Miracles happen every
day....

Give a smile to someone.
Each time u gift a smile, it will make someone's day.....

Saturday, 14 January 2017

All about Bhogi Festival..

🌻🌹భోగి పండుగ సందర్భంగా.....🌹🌻

🍀భోగి లేదా భోగి పండుగ అనునది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది.

🌷విశేషాలు🌷

🍀సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి భోగిపర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని. కానీ ఏది లభిస్తే మరి ఇంకేదీ కావాలని అనిపించదో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యం అవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈరోజున అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ పొందినది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుని చేపట్టినది. రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది. రంగనాథుని సాంగత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పరంగా నిర్వచించేవారు చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతున్నది. తర్వాతు రీహ్య్ నుంచి మకర మాసం వస్తున్నది సౌరమానం ప్రకారంగా. ఈ ధనుర్మాస వ్రతమంతా ఈరోజు పూర్తీ జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామియొక్క అనుగ్రహాన్ని పొందినది.

🌷భోగి మంటలు🌷

🍀చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి. ఈ రోజున ఆంధ్రులు మంటలు వేసి చలికాచుకుంటారు, ఈ మంటలనే భోగి మంటలు అంటారు. భోగిమంటలకు ఎక్కువగా తాటిఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకొని తెచ్చి భోగిమంటల కొరకు సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా భోగిమంటల కొరకు తాటాకు మోపులను ఇళ్ళవద్దకే తెచ్చి విక్రయిస్తున్నారు. వీటితో పాటు మంటలలో మండగల పనికిరాని పాత వస్తువులను ముందురోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్యన ఎవరి ఇంటి ముందువారు ఈ మంటలు వేయడం ప్రారంభిస్తారు.

🌷కొత్త బట్టలు🌷

🍀ఈ పండుగనాడు ఆంధ్రులు కొత్తబట్టలు ధరించడం ఒక సంప్రదాయంగా ఉంది. తెల్లవారుజామున భోగిమంటల వద్ద చలికాచుకున్న చిన్నా పెద్దలు భోగిమంటల సెగతో కాచుకున్న వేడినీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు.

🌷ముగ్గులు🌷

🍀పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గువేయడం కొంచెం కష్టంతో కూడుకొన్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు, రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు.

🌷భోగి పళ్ళు🌷

🍀భోగి పండుగ రోజు పిల్లలపై రేగు పండ్లు పోసి ఆశీర్వదిస్తారు, అందుచేత ఈ పళ్ళను భోగి పళ్ళు అంటారు, భోగి పళ్ళ ఆశీర్వాదాన్నీ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు.

🌷భోగి పులక🌷

🍀కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు, ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగుభూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు, ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.

🌷కోడి పందాలు🌷

🍀కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున కోడి పందాలు వేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది, పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీలో ప్రాణాలను పణ్ణంగా పెట్టి పోరాడుతాయి, ఈ పోటీలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. పోటీలో పాల్గొనే కోళ్లపై పందాలు కాస్తారు. తాహత్తుకు మించి మితిమీరిన పందాలు కాయడం వలన కలిగే అనర్ధాల వలన పందాలు కాయడంపై నిషేధాంక్షలు ఉన్నాయి.

🌷గాలిపటాలు🌷

🍀భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా గాలిపటాలు ఎగురవేస్తారు, వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి లేదా కొనుక్కొని ఎగరవేయడంలో పోటీపడతారు.

🌷సెలవు🌷

🍀భోగి రోజు దాదాపు విద్యార్థులందరికి సెలవు ఉంటుంది, వేరువేరు ప్రాంతాలకు చదువుల కోసం వెళ్ళిన విద్యార్థులు భోగికి ముందే తమ స్వంత ఊరు చేరుకుంటారు.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Convert HD TV to SMART TV