FlipkartSearch

Thursday 22 June 2017

మాస్టార్ నేర్పించిన విద్య


ఒక మాస్టార్ని ఓ విద్యార్థి అడిగాడు. సర్, మీరు నేర్పించిన విద్యతో మేము చాలా ఎత్తుకి ఎదిగినప్పుడు మీకు గిల్టీ ఫీలింగ్ రాదా అని. ఎందుకు అని ఆయన అడిగితే "మీరు చేరలేని స్థాయికి మేము చేరుకున్నాం కానీ మీరు మాత్రం ఇలాగే ఉండిపోతున్నారు కదా "అని. దానికి మాస్టారు శైలిలో కొంత విడమరిచి చెప్పాల్సి వచ్చింది.

"ఓ యాభై అంతస్తులున్న బిల్డింగ్ ఎవరు కడతారు. యాభై అడుగుల మనిషి కాదు కదా. ఆరు అడుగుల లోపే ఉన్న మనిషి కడతాడు. అంటే ఎంత ఎత్తున బిల్డింగ్ కట్టడానికి అంత ఎత్తున్న మనిషి కావాలి అంటే ఎలా.?

ఎందరికో నీడనిచ్చే చెట్టు తనకు నీడ లేదే అని ఆలోచిస్తే ఈ సృష్టిలో ప్రకృతికి అర్థమే లేదు. తను నీడ గురించి ఆలోచించకుండా ఉంటేనే నలుగురికి నీడనివ్వగలదు. టీచర్ కూడా అంతే. తన నీడలో ఎందరు ఎదిగినా అది తన ఎదుగుదలగా గుర్తించి ఒదిగి ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాడు. అది నేను ఆస్వాదించాను "అని చెప్పాడు

Convert HD TV to SMART TV

No comments:

Post a Comment