FlipkartSearch

Friday, 24 March 2017

Wife and Husband Whatsapp Jokes in Telugu


భార్య: ఏవండి మీకు ఎవరో ఫోన్ చేస్తున్నారు
భర్త: నేను బాత్ రూమ్ లో ఉన్న స్నానం చేసినాక వచ్చి మాట్లాడుతా నువ్వు ఫోన్ కట్ చేసి బెడ్ పైన పడేయ్


 😆😆😆భర్త చెప్పినట్టుగానే ఫోన్ ని కట్ చేసి ఎలా పడేసిందో చూడండి 😄😄😄😄😄😄😄


----------------------

😃😃😃😜
యత్ర పురుష్య పూజ్యంతే
తత్ర వస్యతే వాసు దేవాయనమః

ఎక్కడైతే పురుషుడు పూజింప బడతాడో....
ఏ ఇంట్లో అయితే పురుషుడికి సముచిత స్థానం లభిస్తుందో...
నోరు తెరిచి మాట్లాడే మహా భాగ్యం   అనుగ్రహింప బడుతుందో...
షాపింగ్ సెంటర్ ల లో ఎవరి అనుమతీ అవసరం లేకుండా అన్నీ కొనుక్కునే బృహత్ అవకాశం ఉంటుందో...
కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు కీళ్లు విరగ కండా క్షమించ బడతాడో...
ఆయా ప్రదేశాలలో శ్రీ మహా విష్ణువు అష్ట లక్ష్ములతో కొలువై ఉంటాడు
ఈ విషయం సూత మహాముని తన శిష్యులకి వాతలు పెట్టి మరీ చెప్పాడు

పురుషులని గౌరవించండి..
👇
భయపెట్టడం, బాధపెట్టడం మానుకోండి🙏😝😝😜
భార్య- ఏమండీ ! రేపు మనింటికి పేరంటానికి వచ్ఛే ఆడవాళ్ళ కి పసుపు కుంకుమ తో పాటు ఏమైనా ఇస్తే బావుంటుందండీ! ఏమివ్వను ?
భర్త - దాందేముంది . నా ఫోన్ నంబర్ ఇయ్యి.
=======================
భార్య...
ఏమండీ! స్వర్గంలో భార్యాభర్తలను కలిసి ఉండనియ్యరంట!?
భర్త...
ఓసి పిచ్చిదానా! అందుకే దాన్ని స్వర్గం అంటారే!!! 
=======================
భర్త: ఒసేయ్ పెరుగన్నంలో పెరుగే కనిపించడం లేదు.....
భార్య: నస పెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉంటదేంటి ????
=======================
పెళ్ళంటే ఎంటీ సామీ...?
"పోవడం " నాయనా...
"అంటే పైకి పోవడమా సామీ.."
దీన్నే తొందరపాటు అంటారు
పోవడం అంటే....
వణికి పోవడం...
సర్దుకు పోవడం...
అణిగి పోవడం...
వొదిగి పోవడం....లాంటివిరా అర్భకుడా...

=======================
భార్య : ఏమండీ ? పక్కింటాయన  వాళ్ళ ఆవిడని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడంటా !
భర్త : ఆయనది పూల వ్యాపారమే...నాది కారం పొడి వ్యాపారం...తీసుకు రమ్మంటావా ?
===========================
భార్య:    ఏమండీ.. మనం 
      సోమవారం షాపింగ్, 
      మంగళవారం హోటల్, 
      బుధవారం ఔటింగ్, 
      గురువారం డిన్నర్ 
      శుక్రవారం సినిమాకు 
      శనివారం పిక్నిక్
వెళ్తే ఎలా ఉంటుంది... సూపర్ కదా!

భర్త:     ఇవన్నీ జరిగితే మనం ఆదివారం గుడికి వెళ్ళాలి 
భార్య:  ఎందుకు?.. 
భర్త:     అడుక్కోవటానికి..
===========================
*:JOKES:*
*ఆనందం :* భార్యాభర్తలు అంటే 
        ఎవరు స్వామీ...?
*స్వామిజి :* జీవితాంతం భార్యను భయపెట్టాలని ప్రయత్నించి భయపడుతూ బ్రతికేవాడు భర్తయితే, భర్తకు భయపడినట్టు నటించి భర్తను భయపెట్టి బ్రతికేది భార్య. భార్యాభర్తలంటే వీళ్ళే నాయనా....
                   

*భార్య :* మీ కోసం ఇడ్లీలు చేశా తినండి.
*భర్త :* వద్దులేవోయ్... నువ్వు చేసిన ఇడ్లీలు తింటే సగం పళ్లు రాలిపోతాయ్!
*భార్య:* తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయ్...
*భర్త : ఆ.....*    
        
*టీచర్:* అరేయ్ ప్రపంచం లో దేశాలు
           ఎన్ని ఉన్నాయ్ రా?
*చింటూ:*మీకెమన్నా పిచ్చా మాష్టారూ? ప్రపంచం లో దేశం ఒకటే ఉంది.. భారత
దేశం.. మిగతావన్నీ 'విదేశాలే' పిచ్చి మాష్టారూ.....
               
                                                             *Boys Talk-*    
 *Boy 1 :-* ఏంట్రా మనము ఎంత చదివినా అస్సలు పాస్ అవ్వడంలేదు.
*Boy 2 :-* అవునురా ... ఐతే చచ్చిపోదామా????????
*Boy 1 :-* వద్దురా బాబు , మళ్ళీ పుడితే LKG నుండి చదవాలి. నావల్లకాదు!!!
         
===========================


👩wife;
ఏమండీ సరదాగా ఓగేమ్ ఆడదామా?
🕵husband ;
సరదాగా ఆడితే కిక్కేముంది?
ఏదైనా ఛాలెంజ్ ఉంటేనే మజా!
wife;
సరే అలాగే నేనోడిపోతే జీవితాంతం మీ మాటే వింటాను!
మీరు ఓడిపోతే జీవితాంతం నా మాటే వినాలి ఇదీ పందెం!!
ఓకే నా?👍
🕵husband ;
డబుల్ ఓకే 👍👍
👩wife ;
సరే!
ఇపుడు నేను కలర్ పేరు చెబితే ఎడమ చెయ్యెత్తాలి! ✋
పండు (Fruit) పేరు చెబితే
కుడి చెయ్యెత్తాలి! 👋
పొరపాటు చేస్తే మీరు ఓడిపోయినట్లే!
పోటీ మొదలయ్యింది!
🍊"ఆరెంజ్" 🍊చెప్పింది 👩wife!
🕵husband ;
😇😇😇😇😇😇
బుర్ర గిర్రున తిరిగింది!
ఏచెయ్యెత్తాలో తెలీక మూడ్రోజుల నుండి శిలా విగ్రహంలా అలాగే నిలబడ్డాడు!!!
మీరైనా ఏం చెయ్యాలో చెప్పి సాటి మగాడ్ని ఆదుకోండి!!!! 👏ప్లీజ్
😆😜😇😄😂😎🤑
-------------------------------------------------------------------------------------------


1 comment: