FlipkartSearch

Monday, 24 July 2017

సరదా ప్రశ్నలు... కొంటె జవాబులు...

🔻 సరదా ప్రశ్నలు... కొంటె జవాబులు... 🔻

1. సుఖంగా ఉన్న ప్రాణాని కష్ట పెట్టడం అంటే?
Ans. పెళ్లి చేసుకోవడం.

2. చావుకు ఎదురు వెళ్లడం అంటే?
Ans. భార్యకు ఎదురు చెప్పడం.

3. గోడకు తల బాదుకోవడం అంటే?
Ans. భార్యకు ఎదైన అర్థమైయ్యేలా చెప్పడం.

4. స్వర్గం నరకం అంటే?
Ans. భార్య పుట్టింటికి వెళ్లడం,
నాలుగు రోజుల్లోనే తిరిగి రావడం.

5. పగ తీర్చుకోవడం అంటే?
Ans. పెళ్లి చేసుకోమని ఒకరికి సలహా ఇవ్వడం.

6. సొంత లాభం చూసుకోవడం అంటే?
Ans. పెళ్లి చేసుకోకుండా ఉండటం.

7. పాపానికి శిక్ష అంటే?
Ans. పెళ్లి జరగడం.

8. లవ్ మ్యారేజ్ అంటే?
Ans. మనతో యుద్ధం చేయడానికి శత్రువుని చూసుకోవడం.

9. పులి నోట్లో తల పెట్టడం అంటే?
Ans. పెళ్లికి సరే అనడం.

10. పెళ్లి ఫోటోలు చూడడం అంటే?
Ans. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడటం.

11. పెళ్లి అంటే?
Ans. చేయని నేరానికి శిక్ష.

12. భార్య భర్తలు గొడవ పడుతూ..
భర్త : నువ్వంటే నాకేమన్న భయమనుకున్నావా ? (కోపంగా)
భార్య : అబద్ధాలు చెప్పకండి..మీరు నన్ను చూడ్డానికి 5 మందితో వచ్చారు..తర్వాత తాంబూలానికి 50 మందితో వచ్చారు.. పెళ్లికి 200 మందితో వచ్చారు...మరి నేను మీఇoటికి ఒక్కదాన్నే వచ్చాను..(వెటకారంగా)
🔻 జీతోపదేశం 🔻
పుట్టిన వారికి వివాహం తప్పదు,
పెళ్లైన వారికి భార్యతో బాధలు తప్పవు,
అనివార్యమగు విషయము గూర్చి శోకింపజాలదు.

🔻 తప్పించుకున్న వాడు ధన్యుడు సుమతీ 🔻" మనిషి జీవితం విచిత్రమైంది
"యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి..
కానీ డబ్బు ఉండదు..??
మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి.
.కానీ సమయం ఉండదు..??వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి.
.కానీ శక్తి మాత్రం ఉండదు..
తెలుసుకునే ప్రయత్నం చేసే లోపు...
జీవితం ముగిసిపోతుంది.
మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు..మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకు తెలియదు...కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్లను మనసారా ప్రేమించండి.ఆప్యాయత అనురాగలను పంచండి..మనం మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి


ఒకరోజు వివేక్ జంట యింటికి అకస్మాత్తుగా స్నేహితులు ఊడిపడ్డారు. 👫👫👫👫

వివేక్ భార్య వివేక్ ని పక్కకు పిలిచి "ఇంట్లో పంచదార లేదు, కనీసం టీ కలపడానికి. ఇప్పుడెలా?"🙇

👨వివేక్ "నీకేం పర్వాలేదు, పంచదార లేకుండానే టీ పెట్టు, నే చూసుకుంటా "అన్నాడు.👍

టీ అందరికి యిచ్చి ☝"ఒక చిన్న గేమ్  ఆడుకుందాం. ఒక  కప్ లో పంచదారలేని టీ ఉంది.☕☕☕☕☕☕ ☕
అదిఎవరికి వస్తే వారు అందరికీ నైట్ డిన్నర్ పార్టీ ఇవ్వాలి " అన్నాడు. 🍻🍖🍗🍤🌉

అంతే ఆ తర్వాత అందరి దగ్గరనుంచి ఒకటే మాట

 "ఆహ!అథ్బుతమైన తియ్యటి టీ. ఇటువంటి టీ ఇంతవరకు ఎప్పుడూ రుచి చూడలేదురా."😄😄😅😂😂😂😂😂😂😂😂😂😂😂...


*కొంటె ప్రశ్నలు-చిలిపి సమాధానాలు*

1.పెంపుడు కోడి భయపడేది ఎప్పుడు?
 కొత్తల్లుడు ఇంటికి వచ్చినప్పుడు...😜

2.మనకు అర్థం కాకున్నా భద్రంగా  దాచుకునేది ఏది?
  డాక్టర్ రాసిచ్చిన ప్రిస్ప్రిక్షన్...🤓

3.”డాక్టర్,డ్రైవర్ “కామెంట్ ప్లీజ్?
  డాక్టర్ చేతిలో ఒక ప్రాణమే ఉంటే,డ్రైవర్ చేతిలో ముప్పై ప్రాణాలు ఉంటాయి...😩

4.సన్యాసికి,సంసారికి తేడా ఏమిటి?
 ఒకరు పులి చర్మం పై పడుకుంటారు..ఇంకొకరు పులి తోనే పడుకుంటారు😜

5.భర్తను భార్య 'మావారు' అని అంటుంది ఎందుకు?
మరి అప్పుడప్పుడు వార్(యుద్ధం) జరిగేది అతని తోనే కాబట్టి...😲

6.పొలాలు అభివృద్ధి చెందితే?
 ప్లాట్లు అవుతాయి🙁

7.డాక్టర్ విస్తుపోయేదెప్పుడు?
 రోగం ఇంత ముదిరిపోయే దాకా ఎందుకున్నారని అడిగితే....'ఆరోగ్య శ్రీ' వర్తిస్తుందని పేసెంట్ చెప్పినప్పుడు..😫😜😜😂😂 ********************
“SORRY “
అనే పదము చాలా
చిత్రంగా  ఉంటుంది...
మనము చెబితే మన వాళ్ళు
దగ్గరౌతారు.
అదే  డాక్టర్  చెబితే
మనవాళ్ళు మనకు
దూరమౌతారు....!😂
******************** ప్రపంచంలో
రెండు అతి ప్రమాదకరమైన
మారణాయుధాలు!
1. భార్య కన్నీరు
2. పక్కింటి అమ్మాయి చిరునవ్వు!
😜😜😜🤣🤣🤣
********************
మనం తినే ప్రతి మెతుకునూ భగవంతుడు నిర్ణయిస్తాడు . . .
కానీ ... ఆ మెతుకు ... బిర్యానీయా . . సద్దన్నమా అనేది భార్య decide చేస్తుంది . .
😄😄😄😄😄😀
********************
ఎన్ని జీయో లాంటి నెట్వర్క్ లు  వచ్చినా ఎంత ఇంటర్నెట్ స్పీడ్ వైఫైలు, బ్రాడ్బాండ్ లు వచ్చినా.......................
నలుగురు ఆడవాళ్లు కూర్చొని మాట్లాడుకొంటే జరిగే డేటా ట్రాన్సఫర్ స్పీడ్ అందుకోవడం చాల కష్టం సుమీ 😜😜
*******************

No comments:

Post a Comment