FlipkartSearch

Wednesday 10 May 2017

నిజంగా జరిగిన కథ

నిజంగా జరిగిన కథ!!
Bore అనిపించినా, దయచేసి పూర్తిగా చదవండి!
పని ముగించుకుని, ఇంటికి బయలుదేరుతున్న అతన్ని
బస్సు గుద్దేసింది,,హాస్పిటల్ లో, ఆక్సిడెంట్ కి గురయిన తన తండ్రికి అర్జెంటు గా 4 యూనిట్ల రక్తం అవసరం అయింది,
వెంటనే తన మొబైల్ డేటా ఆన్ చేసి,
ఫేస్బుక్ లో వాట్సాప్ లో కావాలసిన రక్తం గ్రూప్ వివరాలను టైపు చేసి తన కాంటాక్ట్స్ అందరితో
పంచుకున్నాడు, కానీ... అతను ఊహించినంత స్పందన రాలేదు, కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్న తన తండ్రిని కాపాడుకోవాలని విలవిల లాడిపోయాడు, కానీ ఏం లాభం,
అవసరానికి రక్తం అంధక, ఆపరేషన్ ఆగిపోయింది,
ఆ తండ్రి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి,
అయితే, నా తండ్రిని నేనే చంపుకున్నాను,
నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు,
నేను ఎంత నీచుడిని అని వెక్కి వెక్కి ఏడ్చాడు..
కారణం??
ఈ సంఘటనకు మునుపు, ఎన్నో అబద్దపు సందేశాలను తానే సృష్టించి తన కాంటాక్ట్స్ లోని వారందరికీ పంపించేవాడు,
అవి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంటే, తెగ సంబరపడిపోయేవాడు, అలాంటి పసలేని సందేశాలను పంపిస్తున్న అతని సందేశాలను, స్పందించే వారు తగ్గిపోయారు,
అతడినుండి వచ్చిన తన తండ్రికి అవసరమయిన రక్తానికి సంబంధించిన సందేశాన్ని కూడా, నిజంగా సహాయపడగలిగే పరిస్థితిలో ఉన్న వారు చూసి కూడా,
హా ఇది Fake మెసేజ్ అయుంటుంది లే, అని లైట్ తీసుకున్నారు,తాము తవ్వుకున్న గోతిలో తామే ఏదో ఒకరోజు పడతారు అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ.
సాయిబాబా పుట్టినరోజు అని, వినాయకుడి తల నరికిన రోజు,
అమ్మ కోసం అని, AIDS ఇంజక్షన్ వేస్తారని,
ఈ ఆడియో, ఫోటో షేర్ చేస్తే, వాట్సాప్ చిల్లర పైసలు ఇస్తుందంటూ  ఆడియో లు
ఇలాంటి సందేశాలను సృష్టించి సరదా పడుతున్న వారు,
ఏదో ఒకరోజు తీవ్రమయిన నష్టాన్ని చవిచూస్తారు,
వారు సృష్టించే అబద్ధపు సందేశాలు ఉరిగా మారి తమని తమవారిని కబళించే ప్రమాదం వుంది,
ఎవరికయినా మనం సందేశం పంపుతున్నాము అంటే దానికి అవతలి వారు విలువ ఇచ్చేలా ఉండాలి గానీ, చెత్తను వూడ్చినట్టు డిలీట్ చేసి పడేసేలా వుండకూడదు,
అలాంటి పనికిమాలిన సందేశాను సృష్టించే వారు, ఫార్వర్డ్ చేసే వారు, ఆత్మ పరిశీలనా చేసుకోవాలి
అలాంటి సందేశాలను సృష్టించే వారికి ఈ సందేశాన్ని అంకితం చేస్తూ..
ఈ నిజాన్ని పదుగురితో పంచుకోండి.. !!

No comments:

Post a Comment