FlipkartSearch

Sunday, 26 February 2017

All about Unified Payment Interface (UPI) is here

Photo via via Visual hunt

What is UPI?

"Unified Payment Interface" (UPI) enables all bank account holders to send and receive money from their smartphones without the need to enter bank account information or net banking userid/ password.

Where can UPI be used?

UPI can be used to send and receive money from individuals or to pay directly to merchants.

How can I use UPI?

Users can instantly download a UPI app such as iMobile (for ICICI Bank customer) and Pockets (for ICICI/ non-ICICI Bank customers) and create their own Virtual Payment Address (VPA) such as xyz@pockets or xyz@icici to start using UPI.

What is a Virtual Payment Address (VPA)?

For using UPI, users need to create a Virtual Payment Address (VPA) of their choice and link it to any bank account. The VPA acts as their financial address and users need not remember beneficiary account number, IFSC codes or net banking user id/password for sending or receiving money.

What is a Virtual Payment Address (VPA)?

For using UPI, users need to create a Virtual Payment Address (VPA) of their choice and link it to any bank account. The VPA acts as their financial address and users need not remember beneficiary account number, IFSC codes or net banking user id/password for sending or receiving money.

What is the advantage of UPI Funds transfer over other fund transfer mechanisms?

The service is instant and available 24X7, even on public/bank holidays. Customers can transfer funds in simple steps by providing the virtual payment address of the beneficiary. Also, there is no pre - registration required for the beneficiary.

What is a Virtual Payment Address (VPA)?

"Virtual Payment Address" is an identifier (that takes a form of abc@xyzbank wherein "abc" is a unique name that you can choose for yourself) that can be uniquely mapped to an individual account using a translation service.

How can I transfer money using a VPA?

Enter the details of the beneficiary VPA, amount and remarks. If you have multiple accounts/virtual payment addresses, you can choose the VPA you would like to debit. Click on Submit


Is the beneficiary also required to register for UPI?

Yes, the beneficiary needs to download a PSP app and register for a VPA. They need to communicate this VPA to you to initiate a transaction.

What details do I need to either send money or request money?

You need the VPA of the beneficiary or the remitter. You don’t need any other details to initiate a transaction.


Is there a limit on the value of transactions when I am sending or requesting money using UPI?

Currently, the per-transaction cap is INR 100,000. This may change from time to time and is subject to the UPI guidelines.


What are the timings for initiating and receiving UPI transactions?

UPI services are available 24 hours of the day, all days of the week, throughout the year. There are no holiday restrictions on UPI transactions.

వీధి  చివర- ఒక  పూరి  పాక 

Photo credit: Leon F. Cabeiro via Visualhunt.com / CC BY
ఇంటికి  వెడుతున్నా  నడుచుకుంటూ
.
దారిలో  ఒక  కరంటు స్థంభానికి  ఒక  కాగితం  కట్టి  ఉంది . 
.
"దయచేసి  చదవండి "    అని  రాసి  ఉంది . ఖాళీ  గానే  ఉన్నాను  కదా  అని  దగ్గరకు  వెళ్లి  చూశాను .
.
.
" ఈ  రోడ్డులో  నేను  నిన్న  ఒక  50 రూపాయల  నోటు  పారేసుకున్నాను . నాకు  కళ్ళు సరిగా  కనబడవు .  మీకు  దొరికితే  దయచేసి  ఈ  ఎడ్రెస్  దగ్గరకు  తెఛ్చి  ఇవ్వగలరు,  దయచేసి   ఈ  సహాయం  చెయ్యండి  "  అని  రాసి  ఉంది  .
.
.
నాకు  ఎందుకో  ఆ  ఎడ్రెస్  ఉన్న  చోటుకు   వెళ్ళాలి  అనిపించింది
.
అడ్రెస్   గుర్తుపెట్టుకున్నాను .
.
అది   ఆ  వీధి  చివరన  ఉన్న  ఒక  పూరి  పాక   .  దగ్గరకు  వెళ్లి పిలిస్తే పాక  లో నుండి  ఒక వృధ్ధురాలు  వచ్చింది .   ఆమె  కు  కళ్ళు  సరిగా  కనబడటం  లేదు .ఆ  పాకలో  ఆమె  ఒక్కర్తే  ఉంటోంది అని  అర్ధం  అయ్యింది .  చేతి  కర్ర  సహాయం  తో  తడుము  కుంటూ   బయటకు  వచ్చింది  
.
.
Photo credit: JuditK via Visualhunt / CC BY-ND
"ఏమీ  లేదమ్మా !   నువ్వు  పోగొట్టుకున్న  50 రూపాయల  నోటు  నాకు  కనబడింది  .  అది  ఇఛ్చి  పోదామని  వచ్చాను "  అన్నాను
.
.
ఆమె  ఏడుస్తోంది .
.
"బాబూ !  ఇప్పటికి   ఇలా  దాదాపు   50-60   మంది   వఛ్చి  ఒక్కొక్కరూ  ఒక  50  రూపాయలు   ఇస్తున్నారు .   నాకు  కళ్ళు  కనబడవు .   నాకు  చదవడం   రాయడం  రాదు .నేను  అది  రాయలేదు  బాబూ !  ఎవరో  నాకు  సహాయం  చెయ్యాలి  అనిపించి  అలా   రాశారేమో !" 
.
.
Photo via via VisualHunt.com
" పోన్లే  అమ్మా  ఇదిగో  ఈ  యాభై   నోటు  తీసుకో  ! "
.
.
బాబూ  !  అది  నేను  రాయలేదు . నా   ఇబ్బంది  చూసి  ఎవరో   మహానుభావుడు   ఇలా  రాసిపెట్టి  ఉంటాడు .   వెళ్ళేటపుడు   అది  కాస్త   చించెయ్యి  బాబూ !   అంది
.
.
ఆమె  ఇలాగే  అందరికీ  చెప్పి  ఉంటుంది .  ఒక్కరూ  చించెయ్యలేదు .  ఆమె  రాయలేదు .ఎవరో ఆమెకు  సహాయపడటం  కోసం  ఇలా  రాశారు .
.
.
Photo credit: symphony of love via VisualHunt.com / CC BY-SA
ఆ  రోడ్డున  వెడుతున్న   ఎందరిలోనో  కొందరు అది  చూస్తారు  .  అలా  చూసిన  ఎందరిలోనో  కొందరు  ఆమెకు     సహాయ  పడాలని  అనుకుంటారు .   అలా  అనుకున్న   ఎందరిలోనో   కొందరు   ఆమె  ఇంటికి  వఛ్చి   ఆమెకు  సహాయ  పడతారు .  నేను  అది  చించేస్తే  ఆమెకు   అలాంటి  సహాయం  దూరం  చేసిన  వాడిని అవుతాను ............  ఇలా  సాగుతున్నాయి   నా  ఆలోచనలు ..... అది  చింపెయ్యనా  ?   ఉంచెయ్యనా ? నాకు చెప్పినట్టే  ఇంతకు  ముందు  వాళ్లకు  కూడా  చెప్పి  ఉంటుంది  కదా !  వాళ్ళెవరూ  చింపెయ్యలేదు .  అంటే  అందరూ  ఆమెకు   ఈ  రకంగా  సహాయం  అందాలి  అని  కోరుకుంటున్నారు ........ మరి  నేను  ఎందుకు  అది  చింపెయ్యడం ....... ఇలా  అనుకుంటూ   వస్తున్నాను .
.
Photo credit: Sharada Prasad via VisualHunt.com / CC BY
Photo credit: Filter Collective via VisualHunt.com / CC BY-ND
ఒకాయన   చేతిలో  చిన్న  కాగితం  పట్టుకుని   ఎదురుపడ్డాడు
.
సర్ !  ఈ ఎడ్రెస్   చెప్పగలరా ?  నాకు  ఒక  50  నోటు దొరికింది  .  వాళ్లకి  ఇచ్ఛేద్దామని ఎడ్రెస్  అడుగుతున్నాను .
.
ఆమె  ఎడ్రెస్....
.
నాకు  అనిపించింది  "మానవత్వం  చచ్చిపోలేదు"  .
.
అది  రాసిన  వారికి  మనసులోనే  కృతజ్ఞతలు  చెప్పుకున్నాను .  ఎవరికయినా    సహాయం  చెయ్యాలి  అంటే  ఎన్నో  మార్గాలు  .  ఈ  మార్గం  ఎంచుకున్న  వ్యక్తిని  మనసులోనే  అభినందించాను . .  ఒంటరిగా  నివసిస్తున్న  ఆమెకు   ఇది ఒక  ఊరట  కలిగిస్తుంది  అనడం  లో  నాకు  సందేహం  లేదు .
.
అది  చింపడం   భావ్యం   కాదు .అనిపించింది .
.
నేను  అది  చింపేయాలా ?   అలా  వదిలేయాలా ?
.
వదిలేశాను
.
వదిలేసి   నేను  మంచి పని  చేశానా  ?   లేదా   ?  
.
మీరే  చెప్పండి ...... ఇది  కధ  అయి   ఉండొచ్చు ... కానీ    ఈ   పరిస్థితి  ఎదురయితే  .....
.
పై రచన రాసిన వ్యక్తికి నా హ్రుదయ పూర్వక నమస్కారం
.
.


పనికి రాని పేక్ మెస్సేజ్ లు ప్రతి వారు పోస్ట్ చేస్తారు ఇలాంటివి కనువిప్పు కలిగించే మీ ఆలోచనలు పోస్ట్ చెయ్యండి .ఇది మంచి పోస్ట్!చాలామంది దీనిని ఫార్వర్డ్ చేశారు, చేస్తున్నారు, చేస్తారు కూడా!

Wednesday, 15 February 2017

అర్జునుడా..... కర్ణుడా...

Photo credit: General Press1 via Visualhunt / CC BY-ND
కర్ణుడి దానగుణాన్ని....అందరూ పొగుడుతూ ఉంటే.... అర్జునుడు భరించలేక ఒక రోజు కృష్ణుడి దగ్గరకు వెళ్లి....

బావా! నేను కూడా దానాలు చేశాను.
అవసరమైతే కర్ణుడి కన్నా ఎక్కువ చేస్తాను.
అయినా నన్ను ఎవరూ గుర్తించటం లేదు.
అందరూ కర్ణుడి దాన గుణాన్నే పొగుడుతున్నారు.
దీని వెనకున్న కారణమేమిటి? అని అడిగాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.
===================
ఆ సంభాషణ జరిగిన సాయంత్రం...
అలా కృష్ణుడు, అర్జునుడు వాహ్యాళికి వెళ్లారు. అక్కడ వాళ్లిద్దరికి ఒక బంగారు కొండ కనిపించింది. అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు.

అప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపు చూసి....

ఈ బంగారు కొండను దానం చేయి..... అప్పుడైనా నీకు కర్ణుడి కన్నా మంచిపేరు వస్తుందేమో...అన్నాడు
====================
అర్జునుడు వెంటనే తన సేవకుల చేత....చుట్టుపక్కల ఉన్న గ్రామాలవారికి బంగారం దానంగా తీసుకొమ్మని దండోరా వేయించాడు.అన్ని గ్రామాల ప్రజలు రావటం మొదలుపెట్టారు. అర్జునుడు బంగారాన్ని తవ్వించి చిన్న చిన్న ముక్కలు దానం చేయటం మొదలుపెట్టాడు. ఎంత మందికి దానం చేసినా బంగారం తరగటం లేదు. జనం సంఖ్య పెరుగుతూనే ఉంది....
ఒక రోజు అయ్యేసరికి అర్జునుడు అలసిపోయాడు....
====================
కృష్ణా....
దానం చేయాలంటే చిరాకుగా ఉంది... అన్నాడు... అప్పుడు కృష్ణుడు..నీకు దానం ఎలా చేయాలో చెబుతా.... అని కర్ణుడిని పిలిపించాడు. ఈ బంగారం కొండలు మాకు కనిపించాయి. వాటిని నువ్వు ఎవరికైనా దానం చేస్తే బావుంటుంది..’’ అన్నాడు
======================
వెంటనే కర్ణుడు- అక్కడున్న ప్రజలందరి వైపు తిరిగి- ఈ కొండలు మీవి. వీటిని తవ్వి తీసుకువెళ్లండి..’’ అన్నాడు. అందరూ తమకు కావల్సిన బంగారం తీసుకెళ్లారు
=======================
అప్పుడు అర్జునుడితో కృష్ణుడు....
నీకు మనసులో బంగారంపై ఆశ ఉంది.అందుకే చిన్న చిన్న ముక్కలు పంచిపెట్టావు.
కానీ కర్ణుడికి ఆశ లేదు.అందుకే వారికి కొండ అంతా ఇచ్చేశాడు.
========================
దానం చేసేవారి మనసులో....ఎటువంటి ఆశ ఉండకూడదు....
అప్పుడే ఆ దానం ఫలిస్తుంది....... అని బోధ చేశాడు.
సర్వేజనా సుఖినోభవంతు

Tuesday, 7 February 2017

తెలివైన ఆవు

Photo via via VisualHunt.com
అనగనగా ఒక ఊరు,
ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు.అతని దగ్గర ఒక ఆవు ఉండేది.
అది ఒక రోజు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది. అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలా సేపటి తర్వాత గాని ఆవు బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు ఆ యజమాని, ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన ఆవును కాపాడాలని అనుకోలేదు అతను.ఎందుకంటే ఆ ఆవును పైకి తీయడం అనవసరం ముసలిది అయినది అనుకున్నాడు. అంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపటం మంచిదని భావించాడు ఆ వ్యక్తి. ఆ పనిచేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు. ఆతను పారతో బావిలోని ఆవుపై మట్టి వేయడం ప్రారంభించాడు. పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ ఆయనకు సహాయం చేయసాగారు. ఏం జరుగుతోందో అర్ధం కాని ఆవు మొదట అంబా అరిచింది, తరువాత అరవకుండా ఉండిపోయింది.అమ్మయ్య ఆనుకున్నాడు.

కొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు.
తనపైన మట్టిపడుతున్న ప్రతిసారి ఆవు మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టిమీదే నిలబడి పైకి రాసాగింది. అతనికి,ఆతని పక్కింటి వారికి ఆశ్చర్యం కలిగింది. బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి ఆవు పైకి వచ్చేసింది.

ఆవు తెలివికి మెచ్చిన అతను, తన తప్పు తెలుసుకొని, అప్పటి నుంచి ప్రేమగా చూడసాగాడు.

నీతి :
ఈ ఆవులాగే మనమీద కూడ ఎంతో మంది దుమ్ము, మట్టి వేస్తుంటారు.
కాని ఆ దుమ్మును, మట్టిని దులుపుకొని జీవితంలో పైకి వచ్చేవారే తెలివైనవారు.

Sunday, 5 February 2017

గాడిదకొడకా

ఒక మంత్రిగారి సుపుత్రుడు కళాశాలలో బాగా అల్లరి చేసేవాడు. ఉపాధ్యాయులను ఏడిపించేవాడు. వాణ్ని ఏమీ చెయ్యలేక ఒక తెలుగు మాస్టారు 'ఓరి ఇరవై అయిదూ, ఇరవై ఆరూ! నోర్మూసుకు కూర్చో' అనేవారు. అది తిట్టో ఏమిటో అర్థమయ్యేదికాదు. చివరికి కళాశాల నిమంత్రణ ఉత్సవం(ఫేర్‌వెల్‌)లో కొందరు విద్యార్థులు 'గురువుగారూ చివరిరోజు కదా, ఇవాళైనా ఆ ప్రహేళిక విప్పండి' అని అడిగారు. దానికి ఆయన 'తెలుగు సంవత్సరాల పేర్లు వెతుక్కోండి' అన్నారు. తీరాచూస్తే ఇరవై అయిదు- ఖర, ఇరవై ఆరు నందన! అంటే, రోజూ వాణ్ని 'గాడిదకొడకా' అని ఆయన కసితీరా తిట్టేవారన్నమాట.(అందుకే తెలుగు నేర్చుకొండని మొత్తుకొనేది) ******వాట్సప్ షేర్******

Wednesday, 1 February 2017

సాధువు కోపం

ఓ సాధువు ఓ పార్టీకి వెళ్ళాడు
అక్కడ అంతా బాగా తాగి ఉన్నారు,
అక్కడున్న వారంతా సాధువు వేషం చూసి అతడిని ఆటపట్టించసాగారు
నాయనా నేను ఓ సాధువును,నాకు కోపం తెప్పించకండి,శపించగలను అన్నాడు
వారు అతని మాటలు పట్టించుకోకుండా అరే పాగల్ గా శపిస్తవా శపించురా చూద్దాం బావురు గడ్డమూ నువ్వూ నీ.. అని నవ్వసాగారు
సాధువుకి చాలా కోపం వచ్చింది
అకస్మాత్తుగా సాధువుని చూసి నవ్విన వారందరి కళ్ళూ పోయాయి
వారు తమ తప్పు తెలుసుకుని అతని కాళ్ళ మీద పడి ఏడవసాగారు
స్వామీ మీ మహిమ తెలియక హేళన చేశాం
మా తప్పు మన్నించండి
మా కళ్ళు మాకు ప్రసాదించండి
అని వేడుకున్నారు
అప్పుడు స్వాధువు పలికాడు
అరేయ్ మీకు బాగా ఎక్కేసిందిరా
నేను మిమ్మల్ని శపించలేదు
మీ కళ్ళూ పోలేదు
కరెంటు పోయింది
నాకూ కనపడట్లేదు
కింద పడేలా ఉన్నా నా కాళ్ళు వదలండిరా
పిచ్చిపుల్కాలారా
ఎవరైనా వెళ్ళి జనరేటర్ ఆన్ చేయండి లేవండి పొండి
 ..... .....