FlipkartSearch

Monday 29 January 2018

అంబేద్కర్ అందరివాడు

జై భారత్... అంబేద్కర్ అందరివాడు
👉చిన్నప్పటి నుండి ఆయన పడ్డ అవమానాలు,అవహేళనలు చూసి తన జాతి బానిస విముక్తికి మరియు వారి హక్కుల కోసం పోరాడాడు ఆయన దళితుల కోసం ఏమీ చేసాడో అందరికీ తెలుసు.
👉కానీ భారత జాతికి అంత కన్నా ఎక్కువే చేసారు.
👉నిజానికి ఆయన భారత రాజ్యాంగం రాయకుండా కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేసాయి.రాజ్యాంగం కన్నా ముందే ఆయన" *స్టేట్స్ అండ్ మైనార్టీస్*"అనే పుస్తకం రాసుకున్నారు.
👉అందులో ప్రధానంగా ఓటు హక్కు వున్నా ప్రతి ఒక్కడికి భూ వసతి కావాలని కోరుకున్నారు నిజంగా అది మన ఇప్పటి రాజ్యాంగంలో ఉంటే దేశంలోని లక్షల ఎకరాల భూమి కొద్ది మంది చేతిలో కాకుండా ప్రతి రైతుకు భూమి వుంటుండేటిది, భూములు జాతీయం అవుతుండే.
👉అంటారని తనం కాదు అస్సలు కులం ఉండొద్దూ అనుకున్నారు కానీ కుదరలేదు.
ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇపుడున్న రాజ్యాంగంలో బాబాసాహేబ్ ఆలోచన విధానాల్లోనీ చాల అంశాలను చేర్చలేకపోయారు కేవలం బ్రాహ్మణ అదిపత్యము వల్ల.
🌹దేశానికి 200సం.కు సరిపడా
విద్యా, విదేశీ వ్యవహారాలలో ఆయనకు సరైనా అవగాహన ఉంది.
🌹ప్రతీ వయోజనుడికి *ఓటు హక్కు* కలిపించారు
🌹 *వ్యక్తి గత ఆస్తి రద్దు* చేయమన్నారు
🌹 *పరిశ్రమలను జాతీయ* చేయమన్నారు
🌹 *మహిళలకు ఆస్తి హక్కు* ఉండాలి అగ్రవర్ణ మహిళలు బానిసలుగా ఉన్నారు వారికి హక్కులు ఉండాలని *హింద్ కోడ్ బిల్లు* తయారు చేస్తే అది అమలు చేయకపోతే *భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మొట్ట మొదటిసారి తన మంత్రి పదవి(న్యాయ శాఖ) కు రాజీనామా*చేసారు. ఎవరి కోసం అగ్రవర్ణ మహిళ హక్కుల కోసం.
(రాజ్యాంగం రాసిన వ్యక్తి రాజీనామా చేసారు).
🌹పధ్నాలుగు గంటల గొడ్డు చాకిరీ వ్యవస్థను బద్దలు కొట్టి 1942 సం.లో *8గంటల పని* విధానాన్ని తిసుకవచ్చి
*ఉద్యోగులకు DA, ESI, PF, INSURENCE*లాంటి ఫలాలను అందించినది అంబేడ్కర్ గారు.
*Employment exchange in INDIA*ను ప్రవేశ పెట్టారు.
🌹లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలలో *దళిత హక్కులతో పాటు BC లకు విధ్యా, వైద్యం, ఉధ్యోగాల కోసం మరియు మైనార్టీ హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆస్తుల రక్షణ కోసం ప్రతినిధిగా హాజరై తన గళాన్ని వినిపించారు.*
🌹1935 లో *రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా*ఏర్పాటుకు కారణం అంబేడ్కర్ గారి ఆలోచనలే. హిల్టన్ యంగ్ కమీషన్ కు వివరాలు సమర్పించారు.
🌹 *దామోదర్ వాలి ప్రాజెక్ట్,హిరాకుడ్ ప్రాజెక్ట్, ద సన్ రివర్ వాలి ప్రాజెక్ట్*1945 లో ఆయన ఆలోచనల ప్రతి రూపాలే.
🌹 *గ్రీడ్ సిస్టంను* ప్రవేశ పెట్టింది అంబేడ్కర్
🌹 *పవర్ సిస్టం డెవలప్ మెంట్* కొరకు
*సెంట్రల్ టెక్నికల్ పవర్ బోర్డ్(CTPB)*ను ఏర్పాటు చేసింది అంబేడ్కర్ గారు.
🌹 *సెంట్రల్ వాటర్ ఇరిగేషన్ అండ్ నావిగేషన్ కమిషన్(CWINC)ను* రూపకల్పన చేసారు.దీనివల్ల దేశము లో నేటికీ పొలాల్లోకి ,ఇంటికి నీరు అందుతుంది.
🌹రెండో ప్రపంచ యుద్దం తరువాత దేశములో తలెత్తిన అనేక సమస్యలను *Reconstruction Committee Council లో మెంబర్*గా ఉండి
పరిష్కారం చేసారు.
🌹 "The Evolution of Provincial Finance of
British in India "అనే అంశం మీద ఆయన చేసిన PH.D లోని థిసేస్ *13ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్కు*మూల ఆధారం.
🌹 *జాతీయ చిహ్నంగా నాలుగు సింహాలను* సారనాథలోని అశోక పిల్లర్ నుండి తీసుకుంది అంబేద్కర్ గారు.
🌹 *అశోక్ చక్రాన్ని ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ లో*చేర్చింది అంబేడ్కర్.
🌹రాజ్యాంగం ఏ భేదం లేకుండా… *భారత ప్రజలమైన మేము*… అంటూ మొదలవుతుంది మన రాజ్యాంగం. ఈ ఒక్క మాటతో *భారత నేలపై ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే*అని చెప్పారు అంబేద్కర్. అప్పటికే కులాలుగా, మతాలుగా విడిపోయిన భారతీయులను ఒకే ఒక్క మాటతో ఒక్కటి చేశారు. ఈ సమానత్వంతోనే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.
🌹 *దేశంలో పటిష్ఠమైన వ్యవస్థల్ని నిర్మించేలా రాజ్యాంగంలో నిర్దేశించారు* అంబేద్కర్. *ఏ వ్యవస్థ తప్పు చేసినా మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దేలా అద్భుతమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు.* ఏ వర్గాన్నీ పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా చేశారు. *పాలకులు దారితప్పితే ప్రజలు ప్రశ్నించే హక్కు ఇచ్చారు.* హక్కులతో పాటు ప్రభుత్వాలను గైడ్ చేసేలా ఆదేశిక సూత్రాలను ఇచ్చారు. మనకంటే చాలా ముందుగా రాజ్యాంగం రాసుకున్న అమెరికా వ్యవస్థ కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించలేకపోయింది. కొన్ని పరిష్కారం లేని సమస్యల్ని సృష్టించింది. కానీ *మన రాజ్యాంగం భవిష్యత్ ను చాలా ముందుగా ఊహించి పరిష్కారాలు చూపేలా రచించారు*అంబేద్కర్.
🌹 *అంబేద్కర్ న్యాయశాస్త్రంలో డాక్టరేట్* సాధించారు. మనదేశంలో పౌరహక్కుల విలువను బాగా అర్థం చేసుకున్న వ్యక్తిగా… వాటిని రాజ్యాంగంలో మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. వాటిని ఎవరూ కాదనే అవకాశం లేకుండా తిరుగులేని రక్షణ కల్పించారు. *ప్రజల చుట్టూనే వ్యవస్థ పనిచేసేలా* చేశారు. ప్రతి పౌరుడూ తన ఆలోచనలు చెప్పుకోగలిగేలా *భావప్రకటనా స్వేచ్ఛను ఇస్తూ ఆర్టికల్ 19 రూపొందించారు.అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రాథమిక హక్కుల్ని పార్లమెంట్ కూడా ఉల్లంఘించే పరిస్థితి లేకుండా చేశారు అంబేద్కర్.
🌹 *దేశంలో మత, కుల, లింగ వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్ఛనిస్తూ దాన్ని రాజ్యాంగబద్ధం చేశారు* బాబా సాహెబ్. *అర్టికల్స్ 14, 15, 16లలో సమానత్వ హక్కులు కల్పించారు. ఇవే దశాబ్దాలుగా దేశంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రక్షణకవచాలుగా నిలుస్తున్నాయి.*
🌹దేశంలోని ప్రజలకు తిండి, బట్ట, ఉద్యోగం ఇవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలపైనే పెట్టారు అంబేద్కర్. అందరికీ సమాన అవకాశాలుండాలని చెప్పారు. మహిళలకు రాజకీయ స్వాతంత్ర్యం ఉండాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్.
🌹 *దేశంలో ఎన్ని మతాలు, కులాలు, జాతులు, భాషలు ఉన్నా భారతజాతి సమైక్యతను, సమగ్రతను అంబేద్కర్ కోరుకున్నారు.* అందుకే రాష్ట్రాల స్వేచ్ఛను గౌరవిస్తూనే…ఆర్టికల్ 3ను ప్రవేశ పెట్టి *దేశం పటిష్ఠంగా ఉండడానికి బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండే ఏర్పాటు చేశారు.* రాష్ట్రాలు దేశం నుంచి విడిపోయే అధికారం లేకుండా చేశారు. ఎన్నిరకాల అభిప్రాయాలు, వాదాలున్నా ఇండియా ఒక్కటేనన్న మాటను శాశ్వతం చేశారు. మన రాజ్యాంగం బలమైంది కావడం వల్లే దశాబ్దాలుగా భారతజాతి ఒకటిగా, తిరుగులేని శక్తిగా కొనసాగుతోందంటారు నిపుణులు.
ఇంకా అనేక సంస్కరణలు మరియు సేవలను భారత జాతికి అంబేడ్కర్ అందించారు.
ఇప్పుడు చెప్పండి సగర్వంగా బాబాసాహెబ్ అందరివాడనీ,
 *జై అంబేద్కర్-జై జై అంబేద్కర్*

చంద్ర గ్రహణం గోచారం ఇలా...

చంద్ర గ్రహణం 🌓
జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం: ఏ రాశులవారిపై ఎలా?

ఖగోళ పరంగా చంద్ర గ్రహణం అనేదిసూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరిగుతుంటాడు.

సూర్య, చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్దగాని, కేతువు వద్దగాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

పూర్తి చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంఫూర్ణ చంద్రగ్రహణమనీ, కొంత భాగమే కనిపించకపోయేదాన్ని పాక్షిక చంద్రగ్రహణము అని అంటారు.

జనవరి 31న చంద్రగ్రహణం

ఈ నెల 31 తేది బుధవారం రోజున పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటకరాశిలో సాయంత్రం 5:18 మొదలుకొని 8:41 వరకు కర్కాటక, సింహ లగ్నాలలో రాహూగస్త సంపూర్ణ చంద్ర గ్రహణము సంభవించనున్నది.

భారత కాలమానం ప్రకారం సాయత్రం ప్రారంభం అవుతుంది.

చంద్రగ్రహణం వేళలు ఇవీ...

సాయంత్రం. 5:18 చంద్రగ్రహణ ప్రారంభ కాలం

సా. 6:22 సంపూర్ణ స్థాయిలోకి గ్రహణంరాత్రి. 7:38 గ్రహణం సంపూర్ణ స్థాయి నుండి విడుపు దశ వైపురాత్రి. 8:41 గ్రహణ అంత్యకాలము ( గ్రహణ మోక్షం )గ్రహణం ప్రారంభం నుండి వదిలే వరకు ఉన్న మొత్తం గ్రహణ సమయం 3 గంటల 23 నిమిషాలు.

సంపూర్ణ సూర్య బింబ దర్షణ కాలం మొత్తం"76"నిమిషాలు.

ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది...

చంద్ర గ్రహణం భారతదేశంతో సహ ఆసియా ఖండం, అమెరికా, యూరప్ ఈశాన్యప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం ప్రాంతములందు చంద్ర గ్రహణం కనబడుతుంది.

గ్రహణ గోచారం ఇలా...

ఈ గ్రహణం కర్కాటకరాశిలో ఏర్పడటం మరియు ఆ రాశి నుండి సప్తమ దృష్టి పరంగా మకరరాశిఅవటం చేత ఈ రెండు రాశులవారు మరియు పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రాల వారిపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. కాబట్టి గ్రహణ శాంతిని ఆచరించాల్సి ఉంటుంది.

ఏ రాశివారిపై ఏ ప్రభావం

ధనస్సు-మేషం-కర్కాటక-సింహ రాశుల వారికి అధమ ఫలం.

వృశ్చిక-మకర-మీన-మిధున రాశుల వారికి మధ్యఫలం.

కన్య-తుల-కుంభ-వృషభ రాశుల వారికి శుభ ఫలములను పొందుతారు.

గ్రహణం ఎవరికైనా గ్రహణమే కావునా ద్వాదశ రాశులవారు గ్రహణ నియమ నిబంధనలు పాటిస్తే శుభం కలుగుతుంది.

చంద్రగ్రహణ నిబంధనలు ఇవీ..

ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని గర్భిని స్త్రీలు ప్రత్యేక్షంగా చూడ కూడదు,. ప్రశాంతగా ఉంటూ మనస్సులో భగవంతున్ని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది.
👉.గ్రహణ సమయంలో మల, మూత్ర విసర్జనలు చెయకూడదు అనే అపోహలు వద్దు, అది వాస్తవం కాదు యదావిధిగా మల, మూత్ర విసర్జన చేయవచ్చు. .

ఆ వేళలో ఆహార పానీయ నియమాలు

అన్ని వయస్సులవారు గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్ధాలు, భోజనాలు పూర్తి చేసుకోవాలి. ద్రవ పదార్ధాలు గ్రహణము పట్టే సమయానికి గంటన్నర ముందు వరకు పాలు, జ్యూసులు మొదలగునవి తీసుకోవచ్చును.

గ్రహణము పూర్తి అయిన తర్వాత తలస్నానంచేసి ఫ్రెష్ గా వంట చేసుకొని తినాలి.

ఉదయం చేసిన అన్నం కూరలు మొదలగునవి తినుటకు పనికి రాదు.

కారణము ఏమనగా గ్రహణ సమయంలో నిలువఉన్న ఆహర పధార్ధాలు విష స్వభావాన్ని కలిగి ఉంటాయి.

అవి తింటే వెంటనే వాటి స్వభావాన్ని చూపకపోయినా నిధానంగా శరీరానికి హాని కలిగిస్తాయి కాబట్టి తినకూడదు అని శాస్త్రాలు, పెద్దలు చెబుతుంటారు.

శాస్త్రీయ పద్ధతి అవసరం

గ్రహణ సమయంలో శాస్త్రీయ పద్దతిని ఆచరించాలి అనుకునేవారు వారి శారీరక శక్తి, జిజ్ఞాస ఉన్నవారు గ్రహణము పట్టుటకు ముందు, తర్వాత పట్టు, విడుపు స్నానాలు చేసి ధ్యానం (జపాలు) భగవత్ స్మరణతో ఉండగలిగితే మాములు సమయములో చేసిన ధ్యాన ఫలితంకన్న రెట్టింపు స్తాయిలో ఫలితం లభిస్తుంది.

ముసలివారు, చిన్నపిల్లల్లు, గర్భినిలు, అనారోగ్యంతో ఉన్నావారు చేయకూడదు. చేయనిచో ఏమో అవుతుందనే భయపడకండి.ఏమీ కాదు*

తర్వాత ఇలా చేయాలి.

గ్రహణం పూర్తి అయిన తరవాత ఇంట్లో దేవున్ని శుద్ధి చేసుకోవాలి.

విగ్రహాలు, యంత్రాలు ఉన్నవారు పంచామృతంతో ప్రోక్షణ చేసుకోవాలి.

జంద్యం(గాయత్రి) వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు తప్పక మార్చుకోవాలి.

ఇంటిముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి శాస్త్రోకంగా కూశ్మాండా (గుమ్మడికాయ)పూజ విధి విధానంగా చేయించి గుమ్మంపై కట్టుకుంటే మంచి శుభఫలితాలను ఇస్తాయి.

మీ మీ శక్తి కొలది గ్రహణానంతరం గ్రహదోష నివారణ జపాలు, పూజలు చేయించుకున్న తర్వత ఆవునకు తోటకూర, బెల్లం తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి, పేదలకు ఏదేని ఆహర, వస్త్ర, వస్తు రూపంలో ధానం చేయగలిగితే మీకున్న అరిష్టాలు, గ్రహభాదలు కొంతవరకు నివారణ కలిగి భగవత్ అనుగ్రహం కలుగుతుంది.
Parashu Rama Hindu

Got it as whatsapp forward message

Saturday 6 January 2018

కురుక్షేత్రంలో గాంధారి

కురుక్షేత్రంలో కౌరవులందరూ పోయారని తెలిసిన గాంధారి కోపంతో ఊగిపోతూ కృష్ణుడి దగ్గరకెళ్ళి
కృష్ణా....
'' ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ''
'' నీ కడుపు మంట చల్లారిందా '' అన్నది.
'' నేనేం చేశాను '' అన్నాడు కృష్ణుడు.
'' చేయాల్సిందంతా చేసి.... నా కుమారులందరినీ చంపి .....నేనేం చేశానని అమాయకంగా అడుగుతున్నావా ''. అన్నది ఆవేశంతో ఊగిపోతూ.
'' నీ పిల్లలు చనిపోవడానికి కారణం నేను కాదు '' అన్నాడు కృష్ణుడు.
'' అంటే కారణం నేనా '' కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అడిగింది గాంధారి.
'' ముమ్మాటికీ నువ్వే '' అన్నాడు కృష్ణుడు.
'' నేనా? ఎలా? '' గాంధారి మొహంలో ఆశ్ఛర్యం.
'' ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి. నీకు నీ భర్త మీద ఉన్న ప్రేమతో జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుని ఆయనతో కాపురం చేశావు.
వందమంది పిల్లల్ని కన్నావు గానీ ఆ పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు? వాళ్ళేం చేస్తున్నారు? అని ఒక్కనాడైనా వాళ్ళను పరిశీలించావా?
వాళ్ళు తోటి వారిని ప్రేమిస్తున్నారా? ద్వేషిస్తున్నారా? అని ఒక్కనాడైనా పరీక్షించావా?
నీ పిల్లల ఆలోచనలు, అలవాట్లు మంచివా? చెడ్డవా? అని ఒక్కనాడైనా పట్టించుకున్నావా? అన్నాడు కృష్ణుడు.
'' లేదు '' అంది గాంధారి.
'' నీ కళ్ళకు కట్టుకున్న గంతల్ని తీసి ఆనాడే నీ పిల్లలను నువ్వు సరిగ్గా పెంచి ఉంటే ఈ నాడు కురుక్షేత్రం జరిగేదీ కాదు,
కౌరవులందరూ పోయేవారూ కాదు.
ఇది నీ స్వయంకృతాపరాధమే '' అన్నాడు కృష్ణుడు.
నేడు చాలామంది తల్లిదండ్రులు కూడా సరిగ్గా గాంధారి, దృతరాష్ట్రుల్లా ప్రవర్తిస్తూ
'' చదువులు చంపేస్తుంది '' అంటూ తప్పును చదువుల తల్లిమీద తోసేస్తున్నారు.
'' ప్రైవేటు పాఠశాలలు '' అన్న విత్తనాలను ప్రభుత్వాలు ప్రజల మీద చల్లేస్తే
వాటికి కావాల్సినంత నీరు (విద్యార్థులను చేర్పింది) పోసింది ఎవరు?? మనం కాదా??
వాటికి కావల్సినంత ఎరువులు (ఫీజులు కట్టింది) చల్లింది ఎవరు?? మనం కాదా??
అవి ఎండిపోకుండా, వాడిపోకుండా పగలనక, రాత్రనకా దాన్ని (ట్యాూషన్లు , స్పెషల్ క్లాసులు అంటూ) రక్షిస్తున్నది ఎవరు?? మనం కాదా??
ఏ ప్రైవేటు పాఠశాలైనా
ఏ ప్రైవేటు కళాశాలైనా
ఇంట్లో ఉన్న మన పిల్లల్ని మన అనుమతి లేకుండా బలవంతంగా లాకెళ్ళి చదువు చెప్పిస్తున్నారా??
పరిచయమున్న ప్రతి ఒక్కరినీ ఒకటికి పదిసార్లు ఏ స్కూల్ బావుందని అడిగి, లక్షలకు లక్షలు పోసి మరీ మనమేగా మన పిల్లలను చేర్పిస్తున్నది.
ప్రైవేటు పాఠశాలలు పెట్టే ప్రతి అడ్డమైన కండీషన్లకూ గంగిరెద్దుల్లా తలూపుతున్నది మనం కాదా??
కాస్త చదువుకునే పిల్లలైతే
కుదిరితే ఉదయం ఆరుగంటలకంతా ట్యూషన్ కు పంపుతాం
కుదరకుంటే సాయంత్రం ఆరునుండి రాత్రి తొమ్మదిదాకా ట్యూషన్ లో పడేస్తున్నాం
చదువులో కాస్త వెనకబడిన పిల్లలనైతే ఏకంగా హాస్టల్లలో కుక్కేస్తున్నాం.
పిల్లల పరిస్థితి ఎలా తయారయ్యిందీ అంటే.....
స్కూల్లో ఉన్నా చదవాలి
ఇంట్లో ఉన్నా చదవాలి
ట్యూషన్లో ఉన్నా చదవాలి
చివరికి సెలవురోజుల్లోనూ చదవాలి.
పిల్లల్ని చదువుల యంత్రాలుగా తయారుచేస్తున్నది మనం కాదా??
చేయాల్సిన తప్పంతా మనం చేసి
పెట్టాల్సిన ఒత్తిడంతా పిల్లలపై మనం పెట్టి
ప్రైవేటు పాఠశాలను ఆడిపోసుకోవడం ఎంత వరకు సమంజసమో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి.
ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాం??
పిల్లల భవిష్యత్తు బావుండాలనే కదా అని మనల్ని మనం సమర్థించుకోవడం అందమైన ఆత్మవంచనే అవుతుంది.
చదువు పేరుతో పిల్లల్ని పిండే కొద్దీ చివరకు మిగిలేది పిప్పే.
చదువుకున్నవాడి అదృష్టం బావుండి ఉద్యోగం వస్తే మనం అనుకున్నట్టు వాళ్ళ భవిష్యత్తుకు ఢోకా లేదు.
పొరపాటున ఏ ఉద్యోగమూ రాకపోతే అడుక్కోవడానికి కూడా పనికిరానివాడిగా తయారు చేసిన వాళ్ళం మనమే అవుతాం..... అవుతున్నాం.....
ఎందుకంటే నేటి విద్యార్థుల్లో నూటికి తొంభైతొమ్మిది మందికి చదువు తప్ప (క్రీడలుగానీ, కళలుగానీ) మరేమీ రాదు.... మనమేమీ నేర్పే ప్రయత్నమూ చెయ్యలేదు..... చెయ్యట్లేదు.
ఒక్కమాటతో ప్రపంచాన్ని మార్చే శక్తి నాకు లేకపోవచ్చు.
ఇందులోని నా ఏ ఒక్కమాటైనా
ఏ ఒక్క తల్లి ఆలోచననైనా మార్చగలిగితే
ఏ ఒక్క తండ్రి ప్రవర్తనైనా మార్చగలిగితే
ఏ ఒక్క విద్యార్థి ప్రాణాన్నైనా కాపాడగలిగితే
అంతకన్నా మహాభాగ్యం నాకు మరొకటి లేదు.....forwarded as received..

Wednesday 3 January 2018

*మనిషి* లో *మని*

🔍అనుదినం అలసి సొలసి ఇంటికి తిరిగొస్తాను ...
ఇప్పటికీ అర్ధం కాదు...పనిచేయటానికి బ్రతుకుతున్నానా? లేక బ్రతకటానికి పని చేస్తున్నానా అని  ??
 బాల్యం లో అందరూ మరీ మరీ అడగిన ప్రశ్న ...
పెరిగి పెద్దయ్యాక ఏమౌతావని?
ఆఁ... సమాధానం ఇప్పుడు దొరికింది ...
మళ్ళీ బాల్యం కావాలని... మళ్ళీ పిల్లాడిగా మారిపోవాలని.... ...............
మిత్రుల నుంచి దూరం వెళ్ళాక నిజం తెలిసింది...
వాళ్ళు మిత్రులు మాత్రమే కాదు, నాకు జ్ఞానోదయం కలిగించిన దేవుళ్ళని....
ఔను... లోకం లాజిక్కుని  చూపింది వాళ్ళే మరి..........
 జేబు నిండుగా ఉన్నపుడు ... ఈ దునియా ఏమిటో తెలిపింది వాళ్ళే...
జేబు ఖాళీ అయినపుడు ... తన వాళ్లెవరో తెలిపిందీ వాళ్ళే...
డబ్బు సంపాదించేటపుడు తెలిసింది...
నా విలాసాలన్నీ అమ్మా నాన్నల డబ్బుతోనే సమకూడేవని...
నేను సంపాదించిందంతా కనీస అవసరాలకే సరిపోతుందని...............
 నవ్వాలని అనిపించినా ... నవ్వలేని  పరిస్థితి...
ఎలా వున్నవని ఎవ్వరైనా అడిగి నప్పుడు ---
ఓహ్ ..నాకేం  బ్రహ్మాండంగా వున్నా... అని అనక తప్పనప్పుడు. ...
ఏడవాలన్నా  ఏడవలేని పరిస్థితి..
వాడికేందిరా.. దర్జాగా బ్రతుకుతున్నాడని అన్నప్పుడు...
ఇది జీవిత నాటకం... ఇక్కడ అందరూ నటులే... నటించక తప్పదు....
అవార్డుల కోసం కాదు... బ్రతకటం కోసం...,
కాదు.. కాదు.. బాగా బ్రతుకుతున్నానని నమ్మించటం కోసం.
రాతి మనిషి నిప్పురాజేయటానికి చాలా కష్టపడ్డాడట....
ఇప్పుడు నిప్పు రాజేయాల్సిన పనే లేదు ...
ఇక్కడ మనిషి మనిషిని చూస్తే భగ్గుమంటాడు...
సైంటిస్టులు పరిశోధనలెన్నో చేస్తున్నారట....
బాహ్య లోకం లో జీవం ఉందా లేదా అని....
మరి... జీవితం  లో సంతోషం ఉందా లేదా అని మనిషి వెతకడమే లేదు !!!
ఓజోన్ పొర డ్యామేజ్ అయి భూతాపం పెరిగుతుందని ఆందోళన ...
ఒకరిపై ఒకరికి వుండే ఈర్ష్యా, ద్వేషాల మంటల గురించి పట్టించుకోరే...
పెరుగుతుంది కాలుష్యం మాత్రమే కాదు .. కర్కశత్వం కూడా...
మట్టిలో మొక్కలు నాటాలి.. మనసులో మానవత్వం నాటాలి...
ఇదంతా గట్టిగ అరవాలి.... అందరికి చెప్పాలి....
మళ్ళీ.. ఒక్క క్షణం... నాకెందుకులే అని...
సమస్య నా ఒక్కడిదే కాదుగా అని...
నా కష్టం గురించి అందరూ మాట్లాడాలి....
పక్కవాళ్ళ కష్టం గురించి పట్టించుకునేంత తీరికెక్కడిది నాకు....
నా పని.. నా ఇల్లు.. నా పిల్లలు.. నా...నా.. నా... తోనే నలిగిపోతున్నా...
ప్రక్కవాన్ని నిందిస్తూ రోజు గడిపేస్తున్నా...
జీవితమన్నది తనంత తానుగా నడచి పోతుంది…. గడచి పోతుంది....
మనకళ్ళముందే..... మనకు తెలియకుండానే ముగిసిపోతుంది.
చేయడానికి చాలా టైం వుందని, చావు దగ్గరకోచ్చేదాకా చోద్యం చూస్తున్నా....
చివరికి ఉసూరంటూ కాటిదాక నలుగురి కాళ్ళతో నడిచిపోతున్నా.... కనుమరుగౌతున్నా...
ఎవరినో అడిగాను ..అసలు నిద్రకు చావుకు తేడా ఏమిటి అని ?
ఎవరో మహానుభావుడు ఎంతో  అందంగా సేలవిచ్చాడు !!!
నిద్ర, సగం మృత్యువట! మరి మృత్యువు, ఆఖరి నిద్రట!!!
అసలు ప్రశాంతంగా నిద్రించి ఎన్నేళ్ళయ్యిందో.. ఎదో ఒకనిద్ర ఆవహిస్తే అదే వరం.
ఆనందం లేని అందం.. జవాబు లేని జీవితం.... ప్లాస్టిక్ పరిమళం.. సెల్ ఫోను సోయగం...
ఇది నా నాగరిక జీవనం.   తెల్లారి పోతున్నది...  రోజుమారుతున్నది..
మన జీవన యాత్ర అలాగే గడచి పోతున్నది....
ఏంటో!! జీవితం రైలు బండి  లా తయారయింది...
ప్రయాణం ఐతే ప్రతి దినం చెయ్యాలి... చేరే గమ్యం మాత్రం లేనే లేదు........
ఒకడు శాసించి  ఆనందిస్తాడు ... మరొకడు ఆనందాన్ని శాసిస్తాడు ...
ఒక రూపాయి విలువ తక్కువే....
కానీ, అదే ఒక రూపాయిని లక్ష నుండి విడదీస్తే....
 అది లక్ష ఎప్పటికీ కాదు... ఆ లక్ష సంపూర్ణం కాదు...
అందుకే...  *మనిషి* లో  *మని*కోసం కాకుండా, ఆనందం,సంతోషం కోసం బతకండి.అప్పుడే నిజమైన మనుషులు  అవుతారు.