FlipkartSearch

Wednesday 4 October 2017

నయా లోకం

*నయా లోకం?*
నచ్చినంత నవ్వితే....
పిచ్చివాడంటారు.
తనివితీర ఏడిస్తే....
పిరికివాడంటారు. 
మర్యాదగ ప్రవర్తిస్తే...
అమాయకుడంటారు.
జ్ఞానం ప్రదర్శిస్తే.....
గర్విష్ఠి అంటారు.
తెలిసి తెలియనట్లుంటే...
తెలివి లేదంటారు.
కలుపుగోలుగా మాట్లాడితే...
వదరుబోతంటారు.
ఒంటరిగా ఉంటే....
ఏ 'కాకితో కలవని ఏకాకి అంటారు.
మౌనం వహిస్తే....
కొంపలు ముంచెటోడంటారు.
కాదని వాదిస్తే...
అతివాది అంటారు.
ఏదేమైతే నాకేంటిలే అని ఊరుకుంటే...
స్వార్థపరుడంటారు.
నా జీవితం నాయిష్టం అంటే...
బరి తెగించడమంటారు.
ఎలా బతకాలో ఎరుకయ్యే లోపు
చితికిపోతుందేమో ఈ బతుకు!
ఒక్కటైతే నిజమనిపిస్తుంది
లోకమంతా మెచ్చునట్లు బతకడమంటే
మనం‌ చచ్చినట్లు బతకడమే..
Forwarded as it is